Representative Image (Photo Credit- ANI)

New Delhi, FEB 01: పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బడ్జెట్ ను  ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) అయినప్పటికీ రానున్న కేంద్ర బడ్జెట్ అంచనాలను ప్రతిభింభించేదిలా ఉంటుందని ఆర్థిక విశ్లేషకుల అంచనా. దీంతో మధ్యంతర అకౌంట్ బడ్జెట్ పై (Interim Budget 2024) అంచనాలు పెరుగుతున్నాయి. ఆధాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనాలు,. దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ, పూర్తిస్థాయి బడ్జెట్ లో ఉండేలాంటి ప్రయోజనాలను కొన్నింటిని ఆశించవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

సెక్షన్ 87ఏ కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చునని, దీనికింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 7లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ఆధాయ పన్నుకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలిపి సింగిల్ హైబ్రిడ్ స్కీంను ఈ బడ్జెట్ లో ప్రకటించవచ్చునని అంచనా వేస్తున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు పన్ను సడలింపులు ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన భత్యం పెంపు, బాలికల విద్యాప్రయోజనాలను పెంచడం కీలకమైనవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.