CM Tirath Singh Rawat: మన దేశాన్ని అమెరికా పాలించింది, 20 మంది పిల్లల్ని కంటే రేషన్ ఎక్కువొస్తుంది, లేడిస్ ఆ చిరిగిన జీన్స్ ఎందుకు ధరిస్తున్నారు, ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న బీజేపీ అధిష్ఠానం, తీరత్ సింగ్ రావత్‌కి కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ప్రతీసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సీఎం (Uttarakhand CM Tirath Singh Rawat) తాజాగా కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని... వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చెప్పారు. ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం (ration) ఇస్తున్నామని... ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు.

Tirath Singh Rawat (Photo Credits: Facebook)

Uttarakhand, Mar 22: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ప్రతీసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సీఎం (Uttarakhand CM Tirath Singh Rawat) తాజాగా కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని... వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చెప్పారు. ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం (ration) ఇస్తున్నామని... ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు.

20 మంది కుటుంబ సభ్యులున్న వారికి క్వింటా బియ్యం వస్తోందని, దీంతో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నవారు ఓర్చుకోలేపోతున్నారని అన్నారు. మీకు సమయం ఉన్నప్పుడు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కన్నారని... 20 మందిని ఎందుకు కనలేదని ఆయన ప్రశ్నించారు. కాగా మహిళల వస్త్రధారణపై కూడా కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేడిస్ చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికన్లు భారతీయతను పాటిస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని అన్నారు.

మహిళలు, యువతులు మోకాళ్ళ మధ్య చిరిగిన జీన్స్ ధరించడాన్ని మానుకోవాలని, అసలు ఇది మన భారతీయ సంస్కృతి కాదని ఆయన అన్నారు. ఇక పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీలు, విద్యార్థినులు కూడా ఆయన తీరును దుయ్యబట్టడంతో చివరకు క్షమాపణ చెప్పారు. తాను జీన్స్ కి వ్యతిరేకిని కానని, చీలికల జీన్స్ ధరిస్తేనే తనకు అభ్యంతరకరమన్నారు. జీన్స్ ధారణపై తీరత్ సింగ్ చేసిన కామెంట్లపై ఆయనను హోమ్ మంత్రి అమిత్ షా వివరణ కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉన్న కారణంగా దీనిపై ఇక అయన తదుపరి చర్య తీసుకోలేకపోయారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అంశంపై మండిపడిన సంజయ్ రౌత్, కేంద్రం మంటల్లో కాలిపోక తప్పదని ఘాటు వ్యాఖ్యలు, ప్రకంపనలు రేపుతున్న హోం మంత్రి రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు

తీరత్‌సింగ్‌ రావత్‌పై బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తీరత్‌ను ఢిల్లీకి పిలిచారు. మహిళలు, విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నడ్డా చర్యలకు ఉపక్రమించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. దీంతో తీరత్‌సింగ్‌ మహిళలకు క్షమాపణలు చెప్పారు.

Here's ANI Update

ఇక నిన్నటికి నిన్న మన దేశాన్ని అమెరికా 200 ఏళ్ళు పాలించిందని, మనలను బానిసలుగా చూసిందని, అయితే ఇండియాతో పోలిస్తే తన దేశంలో కరోనా వైరస్ ని అదుపు చేయలేకపోయిందన్నారు. ఈ పాండమిక్ ని ఇండియా కంట్రోల్ చేయగలిగిందని, కానీ అమెరికా చేతులెత్తేసిందని, ఆ దేశంలో 50 లక్షల కరోనా మరణాలు సంభవించాయని ఆయన చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నారని తీరత్ సింగ్ రావత్ పేర్కొన్నారు. ఈ సమయంలో నరేంద్ర మోదీ తప్ప ఈ దేశానికి మరెవరైనా ప్రధాని అయి ఉంటే ఈ దేశం గతి ఎలాఉండేదో ఎవరికి తెలుసునన్నారు. మనం చాలా దారుణ పరిస్థితిలో ఉండేవారమని, కానీ ప్రధాని మనకు ఊరటనిచ్చారని పేర్కొన్నారు. ఇన్ని లక్షలమంది మృతి చెందారా అని విమర్శకులు నోళ్లు నొక్కుకున్నారు.

ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ (Uttarakhand) సీఎం తీరత్ సింగ్ రావత్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ కానీ ఆరోగ్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ కి వెళ్లానని తెలిపారు. తనను ఇటీవల కలిసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement