HC on Sexual Relationship: పెళ్ళైన తరువాత భార్య శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే, అప్పుడు భర్త పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

సరైన కారణం లేకుండా సెక్స్ ని జీవిత భాగస్వామి వ్యతిరేకించడం క్రూరత్వమే అని ధర్మాసనం అభిప్రాయపడింది.

Delhi High Court (Photo Credits: IANS)

New Delhi, Sep 18: జీవిత భాగస్వామి ఉద్దేశపూర్వకంగా శృంగారానికి నిరాకరించడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా సెక్స్ ని జీవిత భాగస్వామి వ్యతిరేకించడం క్రూరత్వమే అని ధర్మాసనం అభిప్రాయపడింది. పెళ్లయిన తర్వాత కేవలం 35 రోజుల పాటే కలిసున్న ఓ జంట మధ్య వివాహ బంధం పరిపూర్ణం కాకపోవడంతో వారికి కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

ఫ్యామిలీ కోర్టు అనుసరించిన విధానాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి ఎలాంటి కారణంగా లేకుండా శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అని, ఆ కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ఓ జంట 2004లో వివాహం చేసుకుంది.

భర్త అక్రమ సంబంధం నిరూపించేందుకు లాడ్జిలోని సీసీ పుటీజీ ఇవ్వాలని కోర్టును కోరిన భార్య, ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇదిగో..

అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే భార్య పుట్టింటి వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో ఆ భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు (Family Court) వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఈ విడాకులను సవాల్‌ చేస్తూ ఆ భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది.

భర్తకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ప్రామిస్‌తో ప్రియుడితో శృంగారం, కీలక వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు

శృంగారం లేని వివాహ బంధం శాపం లాంటిదే. శారీరక బంధంలో నిరాశకు మించిన దారుణం వైవాహిక జీవితానికి మరొకటి ఉండదు. ప్రస్తుత కేసులో.. భార్య శృంగారానికి నిరాకరించడంతో వారి వివాహ బంధం పరిపూర్ణం కాలేదని కోర్టు గుర్తించింది. అంతేగాక, ఎలాంటి ఆధారాల్లేకుండా ఆమె వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఎలాంటి కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య ఇది దారుణ పరిస్థితే. అందువల్ల ఆ కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చు’’ అని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.