'Will Close Down Facebook in India': ఆ కేసుకి సహకరించకపోతే ఫేస్‌బుక్‌ను ఇండియాలో బ్యాన్ చేస్తాం, సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు

పోలీసులతో ఫేస్‌బుక్ సహకరించకపోతే, ఇండియా అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Karnataka High Court (Photo Credits: Wikimedia Commons)

సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసులో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులతో ఫేస్‌బుక్ సహకరించకపోతే, ఇండియా అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసు దర్యాప్తుపై రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ కార్యకలాపాలను మూసివేసేలా ఆర్డర్ జారీ చేయడాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు బుధవారం ఫేస్‌బుక్‌ను హెచ్చరించింది.

ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి భార్య కవిత దాఖలు చేసిన కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం ఫేస్‌బుక్‌ను హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి చర్యలపై కూడా సమాచారం ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్‌బుక్‌ను ఆదేశించింది.

అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. అయితే జూన్ 26వ తేదీ లాస్ట్, అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలేంటో ఓ సారి చెక్ చేసుకోండి

తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఏ చర్య తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం తెలియజేయకపోవడం బాధాకరం. మంగళూరు పోలీసులు కూడా తగు విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్న కోర్టు, విచారణను జూన్ 22కి వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది.

తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాడని కవిత తన పిటిషన్‌లో చెప్పడంతో ఇదంతా మొదలైంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)కి మద్దతుగా ఫేస్‌బుక్‌లో సందేశం పెట్టారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.కొందరు దుర్మార్గులు అతని పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి సౌదీ అరేబియా రాజు, ఇస్లాంకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టారు.

రుణాలు ఎగవేసినవారితో రాజీ చేసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన, ఇదేమి నిర్ణయమంటూ దుమ్మెత్తిపోస్తున్న బ్యాంక్‌ యూనియన్లు

విషయం తెలుసుకున్న శైలేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. మంగళూరు సమీపంలోని బికర్నకట్టెకు చెందిన అతని భార్య కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుండగా, అతని పేరుతో దుర్మార్గులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు అవమానకరమైన పోస్ట్‌లకు సంబంధించి సౌదీ పోలీసులు శైలేష్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు.

ఈ విషయమై మంగళూరు పోలీసులు సోషల్ మీడియా దిగ్గజానికి లేఖ రాసి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచిన సమాచారాన్ని రాబట్టారు. అయితే, పోలీసులు రాసిన లేఖపై ఫేస్‌బుక్ స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ కవిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సౌదీ జైలు నుంచి తన భర్తను విడుదల చేయడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని బాధితురాలి భార్య కూడా కోరింది.