Rajasthan Shocker: పోలీస్ స్టేషన్‌లోనే మహిళపై 3 రోజుల పాటు ఎస్సై అత్యాచారం, రాజస్థాన్‌లో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపిన అల్వార్ ఎస్పీ

ఓ ఎస్సై పోలీస్ స్టేషన్‌లోనే మహిళపై దారుణానికి తెగబడ్డాడు. భర్త విడాకులు ఇస్తున్నాడని దీన్ని ఆపాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై కెర్లి పోలీస్ స్టేషన్‌లో మూడు రోజులపాటు ఎస్సై అత్యాచారానికి (woman allegedly raped inside Rajasthan police station) పాల్పడ్డాడు. అల్వార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Jaipur, mar 9: రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్సై పోలీస్ స్టేషన్‌లోనే మహిళపై దారుణానికి తెగబడ్డాడు. భర్త విడాకులు ఇస్తున్నాడని దీన్ని ఆపాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై కెర్లి పోలీస్ స్టేషన్‌లో మూడు రోజులపాటు ఎస్సై అత్యాచారానికి (woman allegedly raped inside Rajasthan police station) పాల్పడ్డాడు. అల్వార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ 2018లో భర్తపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా, మహిళ భర్త విడాకులకు సిద్ధం కాగా, ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో మహిళ ఈ నెల 2న పోలీస్ స్టేషన్‌కు ( Rajasthan police station) వెళ్లి ఎస్సైని కలిసినట్టు అల్వార్ ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనపై మధ్య వయసులో ఉన్నఎస్సై మార్చి 2 నుంచి మూడు రోజులపాటు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె ఫిర్యాదుపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని, నిందితుడు సింగ్‌ను అరెస్ట్ (police officer arrested ) చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నట్టు చెప్పారు. ఎస్సైకి, బాధిత మహిళకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డును కూడా ఆమె అందించినట్టు తెలిపారు.

డెబ్భై మూడేళ్ల వృద్ధుడితో ప్రేమ, 1.3 కోట్లతో పరారయిన మహిళ, ముంబైలో షాకింగ్ ఘటన, మరో చోట వ్యాపారవేత్తను ఇంటికి పిలిచిన మహిళ, మత్తు మందు ఇచ్చి నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్

నిందితుడిని సస్పెండ్ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఐజీ నుంచి ఆదేశాలు అందినట్టు ఎస్పీ వివరించారు. బాధిత మహిళ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.