BJP MLA Mahesh Singh Negi: ఆ బీజేపీ ఎమ్మెల్యే నా బిడ్డకు తండ్రి, కావాలంటే డీఎన్‌ఏ టెస్ట్ చేయించండి, మహిళతో పాటు కాంగ్రెస్ పార్టీ డిమాండ్, చిక్కుల్లో ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి

తనను లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ పోలీసులను (Dehradun’s Nehru Colony police station) ఆశ్రయించడం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.

Uttarakhand BJP MLA Mahesh Singh Negi (Photo-ANI)

Dehradun, August 18: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై (BJP MLA Mahesh Singh Negi) వచ్చిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో (Uttarakhand Politics) ప్రకంపనలు రేపుతున్నాయి. తనను లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ పోలీసులను (Dehradun’s Nehru Colony police station) ఆశ్రయించడం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.

తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పొరుగున ఉండే తాను 2016లో తన తల్లి అనారోగ్యానికి సంబంధించి తొలిసారి అతణ్ని కలిశానని చెప్పారు. ఈ నేపథ్యంలో 2016 - 2018 మధ్య తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, తన పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఢిల్లీలో దారుణం, 12 ఏళ్ల బాలికను క్రూరంగా హింసిస్తూ రేప్ చేసిన కామాంధులు, ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం

చివరకు ఎమ్మెల్యే నన్ను నా భర్త దగ్గరకు వెళ్లొద్దని ఆదేశించాడని, ఆయన ఒత్తిడి కారణంగానే తన అత్తమామలు, భర్తపై తప్పుడు కేసులు పెట్టానని చెప్పారు. ఈ విషయాన్ని తన భర్తకు వివరించడంతో అతను తనతో తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. తను ఈ ఏడాది మే18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరు విప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. ఎమ్మెల్యే భార్య రీటా నేగి.. తన భర్తపై అత్యాచారం కేసు పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తామని ఆ వివాహిత బెదిరించిందనీ, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు తన భర్త రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని, తన కొడుకును చంపేస్తానంటూ బెదిరించిందని నేగి భార్య ఆరోపించారు. ఈ ఫిర్యాదులను ధృవీకరించిన డెహ్రాడూన్ డీఐజీ అశోక్ కుమార్ బ్లాక్ మెయిల్ ఆరోపణలపై మహిళ, తల్లి తదితరులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు జరుగుతోందన్నారు. తండ్రి, తాతే కామాంధులు అయ్యారు, తమిళనాడులో బాలికపై అత్యాచారం, ఇద్దరూ పోక్సో చట్టం కింద అరెస్ట్, బాలిక ప్రెగ్నెన్సీని తొలగించడానికి కోర్టు అనుమతి

మరోవైపు ఈ ఆరోపణలను నిరాధారమైనవంటూ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించి, రాజకీయ నాయకులుగా మారడానికి ఒక ముఠా పనిచేస్తోందని ఆరోపించారు. త్వరలోనే నిజాలు బహిర్గతమవుతాయన్నారు. పోలీసుల దర్యాప్తు ఫలితాల ఆధారంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సిధర్ భగత్ ప్రకటించారు. దీనిపై రెండేళ్ల తర్వాత ఆ మహిళ ఎందుకు ఫిర్యాదు చేసిందనేది కూడా తేలాల్సి ఉందన్నారు.

దీనిపై ఉత్తరాఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్‌ మండిపడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.