Tamil Nadu Minor Girl Rape Case: తండ్రి, తాతే కామాంధులు అయ్యారు, తమిళనాడులో బాలికపై అత్యాచారం, ఇద్దరూ పోక్సో చట్టం కింద అరెస్ట్, బాలిక ప్రెగ్నెన్సీని తొలగించడానికి కోర్టు అనుమతి
Representational Image (Photo Credits: File Image)

Chennai, July 23: సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే కామాంధుడుగా మారి కన్నకూతురి జీవితాన్ని (Tamil Nadu Minor Girl Rape Case) చెరిపేశాడు. ఒడిలో పాపను పెట్టుకుని ఆడించాల్సిన తాతే మనవరాలిని చెరబట్టాడు. ఫలితంగా 15 ఏళ్ల ఒక బాలిక గర్భవతి అయ్యింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటు చేసుకుంది. ఫ్రీ వైఫై‌తో 80 వేల పోర్న్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసింది, ఆస్పత్రి బెడ్ మీద నుంచే వీడియోలు చూసింది, యూకేలో పోలీసులకు షాకిచ్చిన ఘటనపై ఓ లుక్కేయండి

ఘటన వివరాల్లోకెళితే.. తమిళనాడులోని తంజావూరులో (Thanjavur) 15 ఏళ్ల బాలిక తల్లి మరణించినప్పటి నుంచి ఆమె తండ్రి వద్ద ఉంటోంది. అయితే ఆమె తండ్రి, తాతలు బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన అత్తతో చెప్పగా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో తాత, తండ్రిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటికే బాలిక గర్భవతి అయింది.

బాలిక గర్భవతి కావడంతో దీనిపై విచారించిన కోర్టు బాలిక ప్రెగ్నెన్సీని తొలగించడానికి (pregnancy termination) అనుమతినించింది. సాధారణంగా 20 వారాల ప్రగ్నెన్సీని మాత్రమే తొలగిస్తారు. కానీ బాలికకు ప్రస్తుతం 25 వారాలు (gestation period). దీంతో వైద్య పరంగా అన్ని పరిస్థితులను పరిశీలించిన న్యాయస్థానం వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రెగ్నన్సీని తొలగించాలని ఆదేశించింది. కొన్ని అసాధారణమైన పరిస్థితిలో న్యాయంస్థానం బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాలిక ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లకుండా ఇలాంటి తీర్పులు ఇవ్వచ్చని న్యాయం స్థానం పేర్కొంది.

ఇక ఏపీలో మరో హేయమైన ఘటన చోటు చేసుకుంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళకు వివాహం కాగా..ఆమెకు, భర్తకు మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్లుగా విడిపోయి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె అమ్మమ్మ వద్దకు వెళ్లగా మరో కుమార్తె తల్లి వద్దనే ఉంది. అయితే తల్లితో అప్పటికే అక్రమ సంబంధం నడిపిస్తున్నఓ ఆటో ఢ్రైవర్ కన్ను కూతురు మీద కూడా పడింది. . ఈ క్రమంలోనే రెండు దఫాలు బాలికను బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని బాలిక తన తల్లి దృష్టికి తీసుకెళ్లగా గోలచేయవద్దని.. ఇరువురికి పెళ్లిచేస్తానంటూ నచ్చజెప్పేందుకు యత్నించింది. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడం ఏమిటంటూ బాలిక నిలదీయగా చంపేస్తానంటూ ఆటో డ్రైవర్ బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి బేస్తవారిపేటకు చేరుకుని అమ్మమ్మ ఇంట జరిగిన విషయం చెప్పి బావురుమంది. దిగ్భ్రాంతి చెందిన వారు బుధవారం సాయంత్రం స్థానిక ఒంగోలు టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు.

అనంతరం వారి సూచన మేరకు దిశ పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాలిక జరిగిన విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడుపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లి కూడా నిందితుడికి సహకరించిందని కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నటు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే బాలిక తల్లి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు యత్నించింది.