Madhyapradesh Shocker: ఎక్కువ సేపు టీవీ చూస్తున్నాడని ఇనుప రాడ్డుతో కొట్టి భర్త కన్ను పోయేలా చేసింది భార్య, వామ్మో భర్తలు టీవీ విషయంలో జాగ్రత్త

అంతే కాదు కంటి నుంచి రక్తం కావడంతో భయపడిపోయిన సంజయ్ భార్య ఇంట్లో ఉన్న డబ్బులు , నగలు తీసుకొని అక్కడి నుంచి పుట్టింటికి పారిపోయింది.

Image used for representational purpose only | (Photo Credits: Twitter)

భోపాల్, మార్చి 27: ఎక్కువ సేపు టీవీ చూస్తున్నాడని ఇనుప రాడ్డుతో కొట్టి భర్త కన్ను పోయేలా చేసింది భార్య. అత్యంత బాధకరమైన సంఘటన మధ్యప్రదేశ్‌ లోని ఛత్తర్‌పూర్‌ లో చోటుచేసుకుంది. సంజయ్‌ సోనీ అనే వ్యక్తి వారం రోజుల క్రితం ఇంట్లో టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో భార్య వచ్చి ఎప్పుడూ టీవీ చూస్తావేంటి బయటకి వచ్చి అందరితో కలిసి హోలీ అడమని కోరింది. దానికి బదులుగా సంజయ్ సోని తనకు హోలీ ఆడటం ఇష్టం లేదని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయాడు. భర్త తనతో హోలీ ఆడకుండా పదే పదే టీవీ చూస్తుండటంతో ఆగ్రహించిన సంజయ్‌ సోని భార్య సమయం కోసం ఎదురుచూసింది.

ఇంతలో మొహం కడుక్కునేందుకు సంజయ్ ఇంట్లోంచి బయటకు రావడంతో చేతిలో ఐరన్‌ రాడ్‌ తీసుకొని టీవీ చూస్తావా అంటూ కంటిపై కొట్టింది. అంతే కాదు కంటి నుంచి రక్తం కావడంతో భయపడిపోయిన సంజయ్ భార్య ఇంట్లో ఉన్న డబ్బులు , నగలు తీసుకొని అక్కడి నుంచి పుట్టింటికి పారిపోయింది. భార్య రాక్షసత్వంగా ప్రవర్తించడంతో సంజయ్‌ ఎడమ కంటికి గాయమైంది. ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడంతో కంటికి బలమైన దెబ్బ తగిలిందని..కంటి చూపు పోయిందని డాక్టర్లు తెలిపారు. నిజం తెలిసిన సంజయ్ షాక్ అయ్యాడు. టీవీ చూస్తున్నందుకు భర్త అనే గౌరవం లేకుండా ఐరన్‌ రాడ్‌తో కంటిపై దాడి చేసి కంటి చూపే లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి పోలీసులతో చెప్పుకొని కంప్లైంట్ ఇచ్చేందుకు బిడ్డలు, తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు.

RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

టీవీ చూసే విషయంలోనే తరచూ సంజయ్‌ సోనితో అతని భార్య గొడపడుతూ ఉండేదని పోలీసులకు చెప్పాడు. అయితే తనకు చేయడానికి పని లేకపోవడంతో ఇంట్లోనే ఉండేవాడ్ని అని..బయట తిరగడం ఇష్టం లేక టీవీ చూడటానికి అలవాటు పడితే తన భార్యకు అది నచ్చక ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగైనా తన భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మొరపెట్టుకున్నాడు.

తాము చెప్పినట్లు వినకపోతే భర్తపై అలిగే భార్యలను చూశాం. కావాల్సింది కొనివ్వలేదని మొగుడ్ని వదిలి పుట్టింటికి వెళ్లిన వాళ్లు ఉన్నారు. కాని తన భర్త ఎక్కువ సేపు టీవీ చూస్తున్నాడే కోపాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టుకున్న భార్య ఇలా ప్రతీకారం తీర్చుకోవడం చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. మధ్యప్రదేశ్‌ భార్య కర్కశానికి కన్ను పోగొట్టుకున్న వార్త వైరల్ కావడంతో అతనికి జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా మగవాళ్లు వేర్వేరుగా స్పందిస్తున్నారు. కొందరు మద్దతిస్తూ ఓదార్చుతున్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు