Woman Saves Son From Cobra: వామ్మో వెన్నులో వణుకు పుట్టించే వీడియో, క్షణం ఆలస్యమైనా పాము కాటుకు బలయ్యేవాడు, కొడుకును నాగుపాము నుంచి రక్షించిన తల్లి, రెప్పపాటులో పాముకాటు నుంచి బిడ్డను కాపాడిన మాతృమూర్తి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇది!
ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు అతడితోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము (giant cobra) పాకుతూ వెళ్తున్నది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు.
Bangalore, AUG 13: ప్రపంచంలో తల్లిని మించిన యోధులెవ్వరూ లేరు! ఇది కేజీఎఫ్ (KGF) సినిమాలోని డైలాగ్...అయితే నిజజీవితంలో ఈ డైలాగ్‌కు సరిపోయేలా తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడుకుంది ఓ మాతృమూర్తి. ఒక తల్లి తన కుమారుడ్ని పెద్ద నాగుపాము (giant cobra ) బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. అక్కడి సీసీటీవీలో (CCTV) రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు అతడితోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము (giant cobra) పాకుతూ వెళ్తున్నది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు. దీంతో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది. పెద్ద ఎత్తున పైకిలేచింది. ఊడిన బూటు కోసం దగ్గరకు వస్తున్న బాలుడ్ని ఆ పాము కాటేయబోయింది. మరోవైపు పామును గమనించిన తల్లి క్షణాల్లో స్పందించింది. పాము కాటువేయబోతున్న కుమారుడ్ని వెంటనే పక్కకు లాగింది. బాలుడ్ని ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లింది.
దీంతో ఆ పాము పాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. క్షణాల్లో స్పందించి పాము బారి నుంచి కుమారుడ్ని కాపాడిన ఆ తల్లిపై ప్రశంసలు కురిపించారు