Uttar Pradesh Shocker: షాపింగ్‌ మాల్‌లో బట్టలు మార్చుకుంటుండగా మహిళపై అత్యాచారం, పాయింట్‌ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించి రేప్ చేసిన సెక్యూరిటీ గార్డు, బయట చెప్తే నీ భర్తను ఖతం అంటూ వార్నింగ్

సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ రోడ్‌లో ఉన్న పీవీఆర్ మాల్‌లో ఒక మహిళ హౌస్‌ కీపింగ్ పని చేస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆ మహిళ విధుల అనంతరం ఆ మాల్‌లోని గదిలో దుస్తులు మార్చుకుంటున్నది.

Representative image (Photo Credit- Pixabay)

Moradabad, April 01: ఒక మాల్‌లో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డు (Security Guard) దారుణానికి పాల్పడ్డాడు. అందులో క్లీనింగ్‌ పని చేసే మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఆ గదిలోకి వెళ్లి గన్‌తో బెదిరించి లైంగిక దాడికి (Raped) పాల్పడ్డాడు. మరో ఇద్దరు వ్యక్తులు దీనికి సహకరించారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని మొరాదాబాద్‌లో (Moradabad) ఈ సంఘటన జరిగింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ రోడ్‌లో ఉన్న పీవీఆర్ మాల్‌లో ఒక మహిళ హౌస్‌ కీపింగ్ పని చేస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆ మహిళ విధుల అనంతరం ఆ మాల్‌లోని గదిలో దుస్తులు మార్చుకుంటున్నది. అయితే అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డు బలవంతంగా డ్రెస్‌ చేంజ్‌ రూమ్‌లోకి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న తుపాకీతో ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని అతడు బెదిరించాడు.

UP Horror: యూపీలో దారుణం, తల్లిదండ్రులను అర్థరాత్రి గొడ్డలితో నరికి చంపిన 15 ఏళ్ళ బాలిక, అబ్బాయిలతో మాట్లాడనివ్వకపోవడమే కారణం 

మాల్ సూపర్‌వైజర్, హౌస్ కీపింగ్‌ వ్యక్తి ఆ సమయంలో ఆ గది బయట కాపాలాగా ఉండి నిందితుడికి అండగా ఉన్నారు. కాగా, ఈ సంఘటన అనంతరం బాధిత మహిళ ఆ మాల్‌లో పని మానేసింది. కొన్ని రోజులుగా ఆమె మౌనంగా ఉండటంతో ఏం జరిగిందన్న దానిపై భర్త ఆరా తీశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని తెలియడంతో ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు.

College Sealed: బిల్డింగ్ కు ట్యాక్స్ కట్టలేదని  విద్యార్థులకు ఎగ్జామ్ అని కూడా చూడకుండా మహిళా పీజీ కాలేజీకి అధికారులు సీల్.. యూపీలో ఘటన 

దీంతో నిందితుడైన సెక్యూరిటీ గార్డుతోపాటు అతడికి సహకరించిన మాల్ సూపర్‌వైజర్, హౌస్ కీపింగ్‌ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్‌ చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీస్‌ అధికారి తెలిపారు.