Lok Sabha Elections 2024: ఎన్నికల్లో భారత్ సరికొత్త చరిత్ర, 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపిన ఈసీ
దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారని ఎన్నికల కమిషన్ తెలిిపంది. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత్ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారని ఎన్నికల కమిషన్ తెలిిపంది. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) తెలిపారు.నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్లు సీఈసీ తెలిపారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగిందన్నారు. అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..
సుమారు 68 వేల మానిటరింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించినట్లు ఆయన తెలిపారు. 2024 ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1692 విమాన సర్వీసులను వాడినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల వేళ పది వేల కోట్ల నగదును సీజ్ చేసినట్లు సీఈసీ తెలిపారు. డ్రగ్స్, మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Here's Video
ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు 495 ఫిర్యాదులు వచ్చాయని, దాంట్లో 90 శాతం తక్షణమే పరిష్కరించినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. టాప్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. డీప్ ఫేక్, ఏఐ ఆధారిత కాంటెంట్‌ను చాలా వరకు నియంత్రించినట్లు ఆయన తెలిపారు.