Wrestlers Call Off Protest: ఇక నుంచి కోర్టులో యుద్ధం కొనసాగుతుంది, 5 నెలల తరువాత ఆందోళన విరమించిన రెజ్లర్లు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగిన ఆరు నెలల తర్వాత, రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.

Wrestlers Protesting (Credits - IANS)

New Delhi, June 26: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగిన ఆరు నెలల తర్వాత, రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.

సోషల్ మీడియాలో ప్రసారం చేయబడిన ఒక ప్రకటనలో, నిరసన తెలిపిన రెజ్లర్లు.. సింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. అయితే అది కోర్టులో కొనసాగిస్తాం వీధుల్లో కాదని తెలిపారు. జూలై 11న జరగనున్న డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం వేచి చూస్తామని రెజ్లర్లు పేర్కొన్నారు.ఈ మేరకు రెజ్లర్ సాక్షిమాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కోర్టులో యుద్ధం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఈ నెల 15న బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆందోళన విరమించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాంక్ష

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) తాత్కాలిక ప్యానెల్, క్రీడా మంత్రిత్వశాఖ, డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఏ) దాఖలు చేసిన ఫిటిషన్‌ను ఆదివారం విచారించిన గువాహటి హైకోర్టు రెజ్లింగ్ బాడీ ఎన్నికలపై స్టే విధించింది.రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ మైనర్ సహా టాప్ ఒలింపియన్స్ అయిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆందోళనకు దిగారు. అయితే, ఈ ఆరోపణలను సింగ్ కొట్టిపడేశారు.