YES Bank Reconstruction Scheme: యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్లాన్, ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డు సస్పెండ్

ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడనుందనే సంకేతాలు కనిపిస్తుండటంతో కేంద్రం, ఆర్‌బిఐ యస్ బ్యాంకును గట్టెక్కించడానికి కావాల్సిన అన్ని రకాలు చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డును సస్పెండ్ చేసిన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆ బ్యాంకు పునరుద్ధరణకు ఆ కొత్త ఓ పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ బ్యాంకుపై మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ఈ సరికొత్త ప్లాన్ ను ఆర్‌బిఐ ప్రకటించింది.

Yes Bank Reconstruction Scheme 2020 (Photo-ANI)

New Dlehi, Mar 06: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ (YES Bank) పునరుద్దరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడనుందనే సంకేతాలు కనిపిస్తుండటంతో కేంద్రం, ఆర్‌బిఐ (RBI) యస్ బ్యాంకును గట్టెక్కించడానికి కావాల్సిన అన్ని రకాలు చర్యలను తీసుకుంటోంది.

యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు, కస్టమర్ల సొమ్ము ఎక్కడికీ పోదు

ఇప్పటికే యస్ బ్యాంకు బోర్డును (YES Bank Board) సస్పెండ్ చేసిన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆ బ్యాంకు పునరుద్ధరణకు ఆ కొత్త ఓ పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ బ్యాంకుపై మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ఈ సరికొత్త ప్లాన్ ను ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్‌ (Yes Bank Reconstruction Scheme) ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే..

1. యస్ బ్యాంక్ ఆథరైజ్డ్ కేపిటల్‌ రూ.5,000 కోట్లుగా మార్పు.

2. ఈక్విటీ వాటాల సంఖ్యను రూ.2 ముఖ విలువతో 2,400 కోట్లకు కుదింపు.

3.రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు ఇన్వెస్టర్ బ్యాంక్‌కు ఉంటాయి. ఈ స్టేక్‌ను రూ.10కి తక్కువ కాకుండా సేకరిస్తుంది.

3.అటువంటి ఇన్వెస్టర్లకు మూడేళ్ళ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. వారు తమ హోల్డింగ్‌ను 26 శాతం కన్నా తక్కువకు తగ్గించజాలరు.

4.ఇన్వెస్టర్ బ్యాంక్ (భారతీయ స్టేట్ బ్యాంక్) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నియమించవచ్చు.

5.రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్ బోర్డులో అదనపు డైరెక్టర్లను ఆర్బీఐ నియమించవచ్చు.

6.రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్ హక్కులు, బాధ్యతల్లో ఎటువంటి మార్పులు లేవు.

7.రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం పొందే హక్కు ఖాతాదారులకు ఉండదు.

8.యస్ బ్యాంక్ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పారితోషికం యథాతథంగా కొనసాగుతాయి.

9.కీలక మేనేజీరియల్ అధికారుల సర్వీసులను బోర్డు నిలిపేయవచ్చు.

10. పునర్నిర్మించిన బ్యాంక్ కార్యాలయాలు లేదా బ్రాంచ్ నెట్‌వర్క్‌లో ఎటువంటి మార్పు ఉండదు

ఏదేమైనా పునర్నిర్మాణం కోసం బ్యాంక్ కొత్త కార్యాలయాలు మరియు శాఖలను తెరవవచ్చు లేదా ఉన్న కార్యాలయాలు లేదా శాఖలను మూసివేయవచ్చు