Modi on International Yoga Day: ప్రపంచ ఉద్యమంగా యోగా, అమెరికా నుంచి ప్రధాని మోదీ వీడియో సందేశం, అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
ఈ యోగా కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి అగ్రశ్రేణి అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులు, ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు.
New Delhi, June 21: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం న్యూయార్క్‌లో అద్వితీయమైన యోగా సెషన్‌కు ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) నాయకత్వం వహించారు. ఈ యోగా కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి అగ్రశ్రేణి అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులు, ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది” అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు. వసుధైవ కుటుంబం అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.ప్రెసిడెంట్ జో బిడెన్(Joe Biden), ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ తన మొదటి అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో ఉన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వతేదీన జరుపుకుంటారు.
యోగా సాధన వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ఇది ప్రపంచ వేదికగా ఉపయోగపడుతుందని మోదీ వివరించారు. సెప్టెంబరు 2014వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగం సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించాలనే ఆలోచనను మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మోదీ నేతృత్వంలో నిర్వహించారు.