Cheetah In India: భారత దేశంలో చిరుతలు అంతరించి పోవడానికి, టీ, కాఫీలకు ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

వీటిని దేశంలో తిరిగి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేశారు.

(Photo Credits: ANI)

భారతదేశంలో చిరుతలు అంతరించిపోయిన 70 సంవత్సరాల మరోసారి భారత ప్రభుత్వం చొరవతో దేశంలోకి ప్రవేశించాయి. వీటిని దేశంలో తిరిగి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేశారు.

అయితే ఈ చిరుతలను పునరావాసం కల్పించిన ఆనందంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే, చిరుత భారతదేశంలో ఎందుకు అంతరించిపోయింది? నిపుణులు దీని వెనుక అనేక కారణాలను తెలుసుకుందాం.

వాతావరణ మార్పు, తక్కువ సంతానోత్పత్తి రేట్లు, వేట

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం, వాతావరణ మార్పులు, వేట, సహజ ఆవాసాలు నాశనం చేయడం వల్ల చిరుతలు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నాయి. ఇవన్నీ వాటి జనాభా పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. చిరుతల స్వంత జన్యువులు కూడా వాటి ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయని ఈ నివేదిక సూచిస్తుంది. చిరుతలు తక్కువ పునరుత్పత్తి రేటును కలిగి ఉంటాయి. ఎడారీకరణను ఎదుర్కోవడానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ (UNCCD COP 14)కి సంబంధించిన పార్టీల కాన్ఫరెన్స్‌లో భారత ప్రతినిధి బృందంలో చేర్చబడిన ఒక పరిశోధకుడు చిరుత అంతరించిపోవడానికి ఎడారీకరణ కూడా ఒక ప్రధాన కారణమని చెప్పారు.

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికం భవనం.. వీడియో ఇదిగో!

భారతదేశంలో చిరుతలు అంతరించిపోవడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఆంగ్ల వార్తాపత్రిక ది హిందూలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, వీటిని మధ్య భారత దేశంలోనూ, రాజస్థాన్ లో రాజులు తమ వినోదం కోసం వీటిని వేటాడే వారని, అలాగే చీతాలను మచ్చిక చేసుకోవడంతో పాటుగా వాటికి తరచుగా శిక్షణ అందించేవారు. అందువలన పెద్ద సంఖ్యలో చిరుతలను బందీలుగా పట్టుకునేవారు. ఇది కూడా చిరుతలు అంతరించిపోవడానికి ఒక కారణంగా చెబుతన్నారు.

చిరుతలు కుక్కల తరహాలో వినయంగా ఉంటాయి. తమ యజమానికి గాయం చేయవచ్చు. ఇది కూడా దాని వినాశనానికి దారి తీసింది. ఈ చిరుతలు చాలా నమ్మకంగా ఉండేవి కాబట్టి వాటిని కుక్కలతో పోల్చారు. పులులు, సింహాలు ఈ విషయంలో ఏమాత్రం లొంగేవి కాదని, చీతాలు మాత్రం మనుషులకు నమ్మకంగా ఉండటం వల్ల దాని జాతికే ముప్పు తెచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

వేట కారణంగా అంతరించిపోవడం

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం శతాబ్దాలుగా కొనసాగుతున్న వేట కూడా కారణమని చెబుతున్నారు. వీటిని తరచుగా రాజ వంశాలు తమ క్రీడా వినోదం కోసం వేటాడేవారు. భారతదేశంలో చిరుతలను వేటాడేందుకు ఉపయోగించిన తొలి రికార్డు కళ్యాణి చాళుక్య పాలకుడు సోమేశ్వర (క్రీ.శ. 1127–1138 వరకు పాలించిన) కే దక్కుతుంది. 12వ శతాబ్దపు సంస్కృత గ్రంథం మనసుల్లాస్‌లో ఈ విషయం ఉందని నివేదిక పేర్కొంది.

చిరుతలను వేటాడటం మొఘల్, బ్రిటీష్ కాలంలో విస్తృతంగా జరిగింది. 1556 నుండి 1605 వరకు పాలించిన అక్బర్ చక్రవర్తి చిరుతలను వేటాడటం, బంధించేందుకు ప్రత్యేకంగా ఇష్టపడేవాడు. అతని జీవితకాలంలో 9,000 చిరుతలను పట్టుకున్నట్లు చెబుతారు.

బ్రిటీష్ పాలనలో చిరుతలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక స్వయంగా సూచిస్తుంది. బ్రిటీషర్లు ఎక్కువగా నీలిమందు, టీ, కాఫీ తోటలను స్థాపించడానికి అడవులను వాడుకున్నారు. దీని ఫలితంగా చీతాలు తమ సహజ ఆవాసాలను కోల్పోయింది, ఇది చీతాలు అంతరించిపోవడానికి దోహదపడింది.