Fire (Image Credits: Twitter)

Beijing, September 17: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో భారీ ఆకాశహర్మ్యం ఒకటి అగ్నికీలల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. హునాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చంగ్సాలోని 42 అంతస్తుల టెలికం భవనంలో నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగి క్రమంగా భీకరంగా మారాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భవనంలోని డజన్ల కొద్దీ అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 218 మీటర్ల ఎత్తైన ఈ భవనంలో ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు 280 మంది ఫైర్ ఫైటర్లు శ్రమించారు.

ఘోరంగా తిట్టుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఇద్దరు మహిళలు, టోల్ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఎవరూ మరణించలేదని టెలికం సంస్థ తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా సెల్‌ఫోన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపింది. అయితే, మొబైల్ యూజర్లు మాత్రం సర్వీసులు పనిచేయలేదని చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భవనం నుంచి దట్టంగా ఎగసిపడుతున్న పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడం, భవనం నుంచి శిథిలాలు కిందపడుతుండడం కొన్ని వీడియోల్లో ఉంటే.. భవనంలో చిక్కుకుపోయిన వర్కర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మరికొన్ని వీడియోల్లో ఉంది.