Zydus Cadila Covid Drug: కరోనా ఇంజెక్షన్ ధర రూ. 2,800, మార్కెట్లోకి యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్‌ను విడుదల చేసిన జైడస్ కాడిలా
100 ఎంజీ ఇంజక్షన్ ను ( Remdesivir For COVID-19 Treatment) తాము రూ. 2,800కు అందించాలని నిర్ణయించామని మార్కెట్లో ఇది 'రెమ్ డాక్' పేరిట అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కరోనాకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ఔషధాన్ని విక్రయిస్తామని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో సంస్థ పేర్కొంది.
New Delhi, August 13: కరోనా మహమ్మారిని తరిమేసేందుకు గిలియన్ సైన్సెస్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్ ను జైడస్ కాడిలా (Zydus Cadila Covid Drug) చౌక ధరకు ఆవిష్కరించింది. 100 ఎంజీ ఇంజక్షన్ ను ( Remdesivir For COVID-19 Treatment) తాము రూ. 2,800కు అందించాలని నిర్ణయించామని మార్కెట్లో ఇది 'రెమ్ డాక్' పేరిట అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కరోనాకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ఔషధాన్ని విక్రయిస్తామని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో సంస్థ పేర్కొంది.
హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, సిప్లా, మైలాన్ ఎన్ వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తరువాత యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసిన ఐదవ సంస్థగా జైడస్ నిలిచింది. అలాగే భారతదేశంతో సహా 127 దేశాలలోరెమ్‌డెసివిర్ పంపిణికి డాక్టర్ రెడ్డీస్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో గిలియడ్ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెమ్‌డిసివిర్ సరఫరా తగినంతంగా లేదని పలు రాష్ట్రాలు కొద్ది వారాల కిందట ఫిర్యాదు చేశాయి. కానీ, సిప్లా సంస్థ మాత్రం మార్కెట్‌లో రెమ్‌డిసివిర్ కొరతలేదని ఈ వారం ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న నెల తరువాత మళ్లీ పాజిటివ్, దేశంలో తాజాగా 66,999 మందికి కోవిడ్-19
భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 66,999 మంది కరోనా (Coronavirus in India)బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,638కు చేరింది. బుధవారం రికార్డు స్థాయిలో 942 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 47,033 మంది ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. కాగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో భారత్ యూకేను దాటేసి నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్ కేసులు ఉండగా, 16,95,982 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు ( COVID-19 Recovery Rate) 70 శాతం ఉంది.