Menstrual Leave in Odisha: ఒడిశా మహిళా ఉద్యోగినులకు శుభవార్త.. మాసంలో ఒక రోజు నెలసరి సెలవు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు ప్రైవేటు సెక్టార్ లో కూడా..
ఒడిశాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
Newdelhi, Aug 16: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిశా సర్కార్ (Odisha Government) అక్కడి మహిళలకు తీపి కబురు చెప్పింది. ఒడిశాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు (Menstrual Leave in Odisha) పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఉద్యోగినులకు నెలసరి సమయంలో తొలిరోజు లేదా రెండో రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడ వెల్లడించారు.
ఇప్పటికే ఇక్కడ అమలవుతున్నది
మహిళలకు నెలసరి సెలవు ప్రకటన ఒక్క ఒడిశాలోనే కాదు. ఇంతకుముందే బీహార్, కేరళ ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతేకాదు కొన్ని యూనివర్సిటీలు కూడా నెలసరి సెలవులను ప్రకటించాయి. వాటిల్లో హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, తేజ్ పూర్, అస్సాంలోని గుహవాటి, చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీల విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి. జొమాటో వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ మహిళలకు ఇలా సెలవులు ఇస్తుండటం విశేషం.