IPL Auction 2025 Live

Pakistan Machination: పాకిస్తాన్ మరో భారీ కుట్ర, తమిళులే చేస్తున్నారంటూ ప్రచారం, ప్రధాని మోడీ తమిళనాడు వెళ్తే ట్రెండింగ్‌లోకి #గోబ్యాక్‌మోడీ, చైనా అధ్యక్షుడి పర్యటనను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్

ఇంతకుముందు ఆయన అక్కడకు వెళ్లిన క్రమంలో 'గోబ్యాక్‌ మోడీ' హ్యష్‌టాగ్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండింగ్ నడిచింది.

Pakistan hand, #GoBackModi trends Hours before #ModiXijinpingMeet (Photo-twitter)

Chennai, October 12:  తమిళనాడు పర్యటనకు వెళ్తున్న ప్రతిసారి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకుముందు ఆయన అక్కడకు వెళ్లిన క్రమంలో 'గోబ్యాక్‌ మోడీ' హ్యష్‌టాగ్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండింగ్ నడిచింది. తాజాగా భారత్‌ పర్యటనలో భాగంగా తమిళనాడుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికేందుకు అక్కడకు వెళ్లిన మోడీకి కూడా అదేవిధమైన అనుభవం ఎదురైంది. ఈసారి 'గోబ్యాక్‌ మోడీ'తో పాటు 'గోబ్యాక్‌ శాడిస్ట్‌ మోడీ' అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా విపరీతంగా ట్రెండ్‌ అయింది.శుక్రవారం భారత్‌లో ట్రెండింగ్‌ అయిన హ్యాష్‌ట్యాగ్‌లో ఈ రెండు ప్రథమ స్థానంలో నిలిచాయి. అయితే ఇది భారీ కుట్రని తేలిపోయింది. పాకిస్తాన్ వేదికగా ఈ ట్రెండింగ్ నడుస్తోందని తెలుస్తోంది. అక్కడి నుంచే ఈ యవ్వారమంతా నడిపిస్తున్నారని దాన్ని తమిళులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆధారాలు బయటకు వచ్చాయి.

పాకిస్తాన్ వేదికగా..

అయితే తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటను కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వారి వల్ల ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చే అవకాశమే లేదు. అయితే, ఇది ఎలా జరుగుతోందని లోతుగా గమనిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా దాయాది దేశం కుట్రలని తేలిపోయింది.

దాయాది దేశం కుట్ర

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్‌కు మింగుడు పడటం లేదు. దీంతోనే ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఇలా #GOBACKMODI హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఇలా పాకిస్థాన్‌కు చెందినవారు వివిధ పేర్లతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్‌తో #GOBACKMODI ట్రెండ్ చేస్తున్నారు.

#GOBACKMODI ట్రెండ్ 

ప్రపంచ దేశాల మద్దతు కూలగొట్టడంలో విఫలమైన పాకిస్థాన్.. ఇలా భారత్‌పై తన అక్కసును వెల్లగక్కుతోంది. శుక్రవారం(అక్టోబర్ 11న) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించినప్పుడు కూడా ఇదే ట్రెండ్ అయింది.

58 శాతం అక్కడి నుంచే

కాగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఆయన మహాబలిపురం ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోడీ ఆలయ విశేషాలను జిన్‌పింగ్‌కు వివరించారు. ఇరుదేశాలకు సంబంధించిన ఇతర కీలక విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. చైనా, భారత్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ భేటీ జరుగుతుండటం గమనార్హం. ఈ భేటీలో ఎలాంటి ఒప్పందాలు జరగవని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి.

ఇద్దరు అగ్ర నేతల కలయిక

కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్‌ 30న చెన్నైలోని ఐఐటి 50వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన ప్రధాని మోడీకి ఇదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా ట్రెండింగ్‌ నడిచింది. ఇక 2018 ఏప్రిల్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడానికి మోడీ తమిళనాడు వచ్చారు. అదేరోజు కావేరీ నీటి నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయడంలో కేంద్ర ఫ్రభుత్వ ఆలసత్వ వైఖరిని నిరసిస్తూ నల్లజెండాలు, నల్ల రిబ్బన్లతో ఆన్‌లైన్‌ నిరసనలు జరిగాయి. అదేవిధంగా ఈ ఏడాది జనవరి 27న ఎయిమ్స్‌ శంకుస్థాపనకు మధురై వచ్చిన సమయంలో కూడా ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ నడిచింది.



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం