Periods Weakness In Women: పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావమై నీరసంగా ఉందా, అయితే కిస్ మిస్ పండ్లతో ఇలా చేయండి..
ఈ ఎండుద్రాక్షను గనుక ప్రతిరోజు మీరు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు.
ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత దీనినే ఎనీ మియా అని కూడా అంటారు. రక్తహీనత వల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేని మీద ధ్యాస లేకపోవడం తరచుగా చిరాగ్గా ఉండడం కళ్ళు తిరగడం చెమటలు పట్టడం ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. వీరికి ముఖ్యంగా బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం కావడం వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది మహిళలు సరైన పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలలో తీసుకోకపోవడం వల్ల ఐరన్ లోపం ఉంటుంది. దీనివల్ల రక్తహీనత అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రక్తహీనత వల్ల పీరియడ్స్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తరచుగా కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం కడుపు నొప్పిగా ఉండడం పీరియడ్స్ సమయంలో చాలామంది ఈ సమస్యల్లో ఎదుర్కొంటారు. అందుకని ఈరోజు మనం రక్తహీనతను తగ్గించేటువంటి ఒక చక్కటి దివ్య ఔషధాన్ని గురించి తెలుసుకుందాం. ఇది రెండు ద్రాక్ష ఈ ఎండుద్రాక్షని కిస్మిస్ అని కూడా అంటారు. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
రక్తహీనతను తగ్గించడంలో ఈ ఎండు ద్రాక్ష అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ఎండుద్రాక్షను గనుక ప్రతిరోజు మీరు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఈ ఎండుద్రాక్షను ఏ విధంగా తీసుకోవాలి. అంటే రాత్రిపూట ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని ఐదు నుండి 10 వరకు ఎండుద్రాక్షలు వేసుకోవాలి. రాత్రి మొత్తము దీనిని నాన్నని ఇచ్చి ఉదయం పూట పరిగడుపున ఆ ఎండుద్రాక్షలతో పాటు ఆ నీటిని కూడా త్రాగాలి ఈ విధంగా గనక ఒక 20 రోజులు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రక్తహీనత సమస్య అనేది పూర్తిగా పోయి ఎనిమియా నుంచి బయటపడతారు