Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు
Egg Attack On BJP MLA Munirathna (photo/X/@HateDetectors)

Bengaluru, Dec 27: బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్, వారి సహచరులతో కలిసి నాపై దాడికి పాల్పడ్డారని మునిరత్న ఆరోపించారు.

"ఇది నన్ను చంపే ప్రయత్నమే. నన్ను అంతం చేసేందుకు దాదాపు 150 మందిని తీసుకొచ్చారు. నా మద్దతుదారులు, పోలీసులు లేకుంటే నన్ను చంపి ఉండేవారు. ఈ దాడిలో డికె శివకుమార్, డికె సురేష్, హనుమంతరాయప్ప, మరికొంతమంది ప్రమేయం ఉంది" అని ఆయన ఆరోపించారు. 1924 భారత జాతీయ కాంగ్రెస్ సెషన్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన సన్నాహాల కోసం బెలగావిలో ఉన్న శివకుమార్ ఈ వాదనలను ఖండించారు.

ఆ బీజేపీ ఎమ్మెల్యే నన్ను గోడౌన్‌కి తీసుకెళ్లి రేప్ చేశాడు, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నపై మహిళ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

నేను సన్నాహాల్లో బిజీగా ఉన్నాను. ఈ ఆరోపణలు నిరాధారమైనవి," అని అన్నారు. అదేవిధంగా మునిరత్న ఆరోపణలను డీకే సురేష్ తోసిపుచ్చారు, ఎమ్మెల్యేనే (BJP MLA Munirathna) తనపై దాడి చేయించుకున్నారని సూచించారు.

బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి,

ఆయన తన ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించి ఈ డ్రామాతో దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని సురేష్ అన్నారు. కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అరెస్టులను ధృవీకరించారు. "ముగ్గురిని అరెస్టు చేశాం. వారు ఎవరో, ఎందుకు చేశారో గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది" అని ఆయన విలేకరులకు తెలిపారు.

బీజేపీ నేతల నుంచి ఖండనలు వెల్లువెత్తుతున్నాయి

ఈ దాడిపై బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మొత్తం రాష్ట్రానికే అవమానకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడి మునిరత్నానికే కాదు, రాష్ట్రమంతటికీ అవమానకరమని, మీరు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నందుకే ప్రజలపై దాడులు చేస్తున్నారని, ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని అన్నారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ మంత్రి సిటి రవి కూడా ఈ సంఘటనను ఖండించారు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీతనం మరియు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. రాజకీయ తుఫాను మధ్య, మునిరత్న న్యాయపరమైన ఇబ్బందులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు సహా పలు పోలీసు కేసులు ఉండగా, ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

SC on Election Freebies: ఉచితాలకు అలవాటుపడిన కూలీలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Rajat Patidar is RCB New Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వెల్లడించిన ఫ్రాంఛైజీ, జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించిన విరాట్ కోహ్లీ

Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

Samsung Galaxy F06 5G: శాంసంగ్‌ నుంచి వచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్స్‌, ధర చూస్తే దిమ్మతిరగాల్సిందే! రూ. 10వేల లోపు ఇన్ని ఫీచర్లతో 5జీ ఫోన్‌ తీసుకురావడం అద్భుతమే

Share Us