Exit Poll Results 2022: మళ్లీ ఊడ్చేసిన చీపురు, ఎంసీడీ అరవింద్ కేజ్రీవాల్‌దే, బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న పలు ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటనుందని పలు ఎగ్జిట్ పోల్స్ ( Exit Poll Results 2022) చెబుతున్నాయి.250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం (AAP Likely to Emerge As Single Largest Party) ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

MCD-Elections-Results (Photo-File Image)

New Delhi, Dec 5: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటనుందని పలు ఎగ్జిట్ పోల్స్ ( Exit Poll Results 2022) చెబుతున్నాయి.250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం (AAP Likely to Emerge As Single Largest Party) ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

భారతీయ జనతా పార్టీకి (BJP Distant Second in Delhi Municipal ) 69 నుంచి 91 సీట్లు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిలపడింది. 3 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇతరులు 5 నుంచి 9 వార్డుల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు ఈ నెల 7న విడుదల అవుతాయి.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీదే హవా, 149 నుంచి 171 సీట్లు సాధించే అవకాశం, రెండవ స్థానంలో బీజేపీ, కనిపించని కాంగ్రెస్, ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడి

కాగా ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 250 వార్డులున్న ఎంసీడీలో మొత్తం 1349 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 709 మంది మహిళలున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసీ అధికారులు 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. ఈస్ట్, సౌత్, నార్త్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌గా (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) మార్చాక జరిగిన తొలి ఎన్నికలివి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 40 వేల మంది పోలీసులు, 20 వేల మంది హోం గార్డులు, 108 కంపెనీల పారామిలిటరీ, రాష్ట్రాల పోలీస్ బలగాలు రక్షణ బాధ్యతల్లో నిర్వహించారు.

అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. ప్రజలు ప్రజాస్వామ్యం పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని హర్షం

కాగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏలుతున్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తోంది. ఇందుకోసం ఎన్నికల్లో పలు తాయిలాలను ప్రకటించింది. ముఖ్యంగా మురికివాడల్లో క్కడ గుడిసె ఉంటే అక్కడే పక్కా ఇల్లు కట్టుకోవచ్చంటూ ప్రచారంతో మార్మోగించింది. 2017 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 26 శాతం ఓటింగ్ సాధించింది. గత ఎంసీడీ ఎన్నికల్లో 21 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 126 సీట్లు సాధిస్తే మ్యాజిక్ నెంబర్ సాంధిచినట్లే.. అయితే ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీవైపు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి నెలకొని ఉంది.



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif