Labh Singh Ugoke And Jivanjot Kaur : పంజాబ్ సీఎంను ఓడించిన వ్యక్తి ఎవరో తెలుసా? మొబైల్ షాప్ లో పనిచేసే వ్యక్తి, సిద్దూను మట్టికరిపించిన మహిళ ప్రత్యేకత ఇదే! ఉద్దండులను ఓడించిన ఆప్ సామాన్యులు వీళ్లే
దేశమంతా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) విజయం గురించే మాట్లాడుకుంటోంది. కానీ పంజాబ్ మాత్రం ఆ ఇద్దరి వైపు చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన హేమాహేమీలు మట్టికరిచారు. రెండు స్థానాల నంచి బరిలోకి దిగిన సీఎం చరణ్ జిత్ సింగ్ (Charnjit singh Channi) చన్నీ...రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. అయితే ఆయన్ను ఓడించిన లాభ్ సింగ్ ఇప్పుడు పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారారు.
Amritsar. March 10: దేశమంతా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) విజయం గురించే మాట్లాడుకుంటోంది. కానీ పంజాబ్ మాత్రం ఆ ఇద్దరి వైపు చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన హేమాహేమీలు మట్టికరిచారు. రెండు స్థానాల నంచి బరిలోకి దిగిన సీఎం చరణ్ జిత్ సింగ్ (Charnjit singh Channi) చన్నీ...రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. అయితే ఆయన్ను ఓడించిన లాభ్ సింగ్ (Labh Singh Ugoke) ఇప్పుడు పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారారు. అటు పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూను అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో ఓడించారు ఆప్ అభ్యర్ధి జీవన్ జ్యోత్ కౌర్ (jivanjot kaur). వీరిద్దరి బ్యాక్ గ్రౌండ్ చాలా సింపుల్. పెద్దగా రాజకీయ అనుభవం, ఫాలోయింగ్ లేని వీరిద్దరూ బడా నేతలను ఓడించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపునకు మెయిన్ ఫార్ములా కూడా వీరిద్దరి బ్యాక్ గ్రౌండే. అదేనండీ బలహీన వర్గాలకు చెందినవారు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని అభ్యర్ధులుగా నిలబెట్టడం ఆప్ (AAP) కు కలిసి వచ్చింది. ప్రధానంగా ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూను (Navajyoth singh siddu) ఆప్ మహిళా అభ్యర్థి ఓడించి వార్తల్లోకి ఎక్కారు. అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఆయన పరాజయం చెందారు. ఇద్దరు హేమాహేమీలు ఓడించిన వీరు ఎవరని నెటిజన్లు వెతుకుతున్నారు.
సామాజిక కార్యకర్త అయిన జీవన్ జ్యోత్ కౌర్ (jivanjot kaur)మహిళా సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా మహిళలు ఉపయోగించే శానిటరి నాప్ కిన్స్ లో విషయంలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్ లను వాడొద్దని చెబుతోంది. పేదవారికి, నిరక్షరాస్యులైన వారికి చాలా విషయాలు చెబుతూ వారిలో మార్పు రావడానికి విశేష కృషి చేస్తున్నారు. అందుకే ఆమెను ప్యాడ్ ఉమెన్ ఆఫ్ పంజాబ్ (Pad Woman Of Punjab) అని పిలుస్తుంటారు. గ్రామీణ మహిళలు మళ్లీ మళ్లీ ఉపయోగించే శానిటరీ ప్యాడ్ల కోసం స్విట్టర్లాండ్ కు చెందిన కంపెనీ చేతులు కలిపారు. పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. వారికి చదిపించడం, ఆరోగ్యం అందించడంతో పాటు తదితర సామాజిక అంశాల్లో పని చేస్తున్నారు.
శ్రీ హేమకుంట్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. దీంతో ఆప్ దృష్టిలో పడిపోయారు. అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని భావించి… ఆమెను బరిలోకి దింపారు. దీంతో ప్రజలు జీవన్ జ్యోతికి ఆదరించారు. ఆమెకే ఓట్లు వేయడంతో సునాయసంగా గెలుపొందారు. ఇప్పడూ అందరూ జీవన్ జ్యోతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ పై ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ (Labh Singh Ugoke) గెలుపొందారు. ఇతను సామాన్య వ్యక్తి. ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న ఇతని తల్లి స్వీపర్ గా పని చేస్తుంటే.. తండ్రి వ్యవసాయ కూలి. కొద్దిరోజులు మొబైల్ లో రిపైర్ షాపులో (mobile repair shop staff)పని చేశారు. ఆప్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో నిలబడి.. ఏకంగా సీఎంను ఓడించి అందరి మనస్సులను గెలుచుకున్నారు. జీవన్ జ్యోత్ కౌర్, లాభ్ సింగ్ విషయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. వారిద్దరు ఎవరో చెప్పారు. విజయం సాధించిన తర్వాత.. ఆప్ నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. సామాన్యుడు తలచుకుంటూ ఎమైనా చేయగలరని నిరూపించారని ప్రశంసించారు నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఓడించింది ఓ సామాన్య వాలంటీర్ అయిన జీవన్ జ్యోత్ కౌర్ అని తెలిపారు. సామాన్య వ్యక్తితో సవాల్ చేయవద్దని… పెద్ద విప్లవాలు వస్తాయన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)