‘BJP in Srilanka &Nepal’: శ్రీలంక, నేపాల్‌లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తాం, అమిత్ షా కోరిక అదే, సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దేబ్, ప్రపంచవ్యాప్తంగా బీజేపీ అవసరం ఉందని తెలిపిన సీఎం

అగర్తాలాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి త్రిపుర ముఖ్యమంత్రి తన రాష్ట్ర పర్యటన సందర్భంగా బిజెపి భారత సరిహద్దులకు మించి విస్తరించాలని హోం మంత్రి కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

Biplab Kumar Deb . (Photo Credit: PTI)

Agartala, February 15: పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకలలో బిజెపిని విస్తరించాలని (BJP in Srilanka &Nepal) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కోరుకుంటున్నారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ (Tripura CM Biplab Deb) శనివారం అన్నారు. అగర్తాలాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి త్రిపుర ముఖ్యమంత్రి తన రాష్ట్ర పర్యటన సందర్భంగా బిజెపి భారత సరిహద్దులకు మించి విస్తరించాలని హోం మంత్రి కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

"హోంమంత్రి మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మేము త్రిపుర రాష్ట్ర అతిథి నివాసం వద్ద ఆయన్ని కలుసుకున్నాము. ఆ సమయంలో అజయ్ జామ్వాల్ (నార్త్ ఈస్ట్ కోసం బిజెపి ప్రధాన కార్యదర్శి) ఆయనకు ఇప్పుడు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో బిజెపి ఎలా అధికారంలో ఉందో చర్చించాము. దీనికి ప్రతిస్పందనగా అమిత్ షా మాట్లాడుతూ నేపాల్, శ్రీలంక ఇంకా మిగిలి ఉన్నాయి. మేము ఇంకా మా పార్టీని దేశం వదిలి ఇతర దేశాలలోకి తీసుకెళ్ళి వాటిని గెలవాలి! ” అని అమిత్ షా అన్నారని దేబ్ బిజెపి కార్యకర్తలకు ఈ సమావేశంలో చెప్పారు.

స్టేజ్ మీదనే హఠాత్తుగా కుప్పకూలిన గుజరాత్ సీఎం, అహ్మదాబాద్‌ ఆసుపత్రికి విజయ్ రూపానీని తరలింపు, ఇతర బహిరంగ సభలను రద్దు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు

Here's Tripura CM Statement Video

రవీంద్ర సతబర్షికి భవన్‌లో త్రిపుర ముఖ్యమంత్రి మాట్లాడుతూ..అమిత్ షా నాయకత్వంలో భారతదేశ సరిహద్దులకు మించి బిజెపి విస్తరణ జరగగలదని, అది అమిత్ షాకు మాత్రమే సాధ్యమని హోమం మంత్రిని ప్రశంసించారు. అటువంటి శక్తిని కలిగి ఉన్న వ్యక్తి అమిత్ షా అని, బిజెపిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని అతని నాయకత్వంలో, బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించగలదని ఆయన కార్యకర్తలతో అన్నారు.