Gautam Adani Shares Jeet Adani and Diva Shah Wedding Picture (Photo Credits: X/@gautam_adani)

Ahmedabad, February 7: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) చిన్న కొడుకు జీత్‌ అదానీ – దివా జైమిన్ షాల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిపించారు. అహ్మదాబాద్‌లో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. జీత్ అదానీ- దివా షాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆత్మీయుల నడుమ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరిగినట్లు అదానీ తెలిపారు. అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన ఈ వేడుకకు శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయానని, అందుకు తనను క్షమించాలన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Gautam Adani Shares Jeet Adani and Diva Shah Wedding Picture

 

అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్‌ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి. జైన్‌, గుజరాతీ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరిపించారు. ఎలాన్‌ మస్క్, బిల్‌ గేట్స్‌, టేలర్ స్విఫ్ట్ వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను అదానీ ఆహ్వానిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, కుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా ఆ ప్రచారాన్ని గౌతమ్‌ అదానీ తోసిపుచ్చారు.