AP CM Jagan on NPR: మోదీ ప్రభుత్వానికి సున్నితంగా ఎదురెళుతున్న ఏపీ సీఎం, మైనారిటీల్లో అభద్రతాభావం.. ఎన్‌పీఆర్‌పై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి

మోదీ సర్కార్ ఏర్పడక ముందు 2010లో ఉన్నట్లుగానే జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు....

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Amaravathi, March 4:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కేంద్ర ప్రభుత్వంతో ఒకవైపు సఖ్యతగా ఉంటూనే మరోవైపు కొన్ని విషయాల్లో సున్నితంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ జనాభా పట్టిక (NPR)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జనాభా రిజిస్టర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాటి వల్ల ఏపీలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతాభావం నెలకొన్న కారణంగా ఆ ప్రశ్నలను మినహాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని సీఎం జగన్ అన్నారు. అయితే అందుకోసం ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోస్తామని ఆయన స్పష్టం చేశారు.

మోదీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఎన్‌పిఆర్ లో కొన్ని ప్రశ్నలుగా తల్లిదండ్రుల జన్మించిన ప్రదేశం, ఆధార్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఓటరు ఐడి నంబర్, మాతృభాష తదితర వివరాలు ఉన్నాయి.అయితే వీటిపై సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ ఏర్పడక ముందు 2010లో ఉన్నట్లుగానే జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy's Tweet

“ఎన్‌పిఆర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు నా రాష్ట్రంలోని మైనారిటీల మనస్సుల్లో అభద్రతాభావాలకు కారణమవుతున్నాయి, మా పార్టీలో విస్తృతమైన సంప్రదింపుల తరువాత, 2010 లో ఉన్నప్పటి మాదిరిగానే నిబంధనలు తిరిగి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి మేము నిర్ణయించుకున్నాము." అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. "ఈ మేరకు, రాబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా మేము ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాము" అని ఆయన మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.  నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలు పూర్తి కావాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

కనీసం గత 6 నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్న నివాసితులు మరియు ఇకపై కూడా అక్కడే నివసించాలనుకునే వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే ద్వారా నమోదు చేయనుంది. అయితే జాతీయ జనాభా పట్టికకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ కు లేదా పౌరసత్వ సవరణ చట్టానికి ఎలాంటి సంబంధం లేదని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif