Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.

Another fight brewing in Haryana poll: As AAP, NOTA and the Communists battle it out, NOTA seems to be winning (Photo-wiki)

Chandigarh,October 24: హర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం చేజిక్కించుకుంటుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీని నోటా ఇంటికి సాగనంపింది. అలాగే ఇతర పార్టీలైన సీపీఎం, సీపీఐలు కూడా డిపాజిట్లను కోల్పోయాయి. ఈ పార్టీలన్నింటికంటే నోటాకే అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి. హర్యానా ఓటర్లు ఈ మూడు పార్టీలను కాదనుకుని నోటాకు ఎక్కువ ఓట్లు వేశారు. ఈ నోటా ఓట్లు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఓ రకంగా అధికారానికి దూరం చేశాయనే చెప్పవచ్చు.

ఈసీఐ వెబ్‌సైట్ డేటా ప్రకారం నోటా ( None Of The Above) ఆప్ కన్నా ఎక్కువ ఓట్లను గెలుచుకుంది. నోటాకు ఈ ఎన్నికల్లో 0.55% ఓట్లు రాగా ఆమ్ ఆద్మీ పార్టీకి 0.45% ఓట్లు వచ్చాయి. రెండు కమ్యూనిస్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు వరుసగా 0.03%, 0.09% ఓట్లు మాత్రమే వచ్చాయి.

కాగా హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీపార్టీ తాము ఆ రాష్ట్రంలో బలంగా ఉన్నామని చెప్పింది. అయితే ఈరోజు వెలువడుతున్న ఫలితాలు ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 0.45 శాతం ఓట్లు మాత్రమే దక్కడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. దీనికిముందు హర్యానాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించి, అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఒక్క లోక్‌సభ సీటును కూడా దక్కించుకోలేకపోయింది.