MLA Subash Chandra Panigrahi: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యా ప్రయత్నం, ఒడిశా అసెంబ్లీలో కలకలం రేపిన ఘటన, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చర్చ జరుగుతుండగా శానిటైజర్ తాగేందుకు ప్రయత్నించిన దేవ్‌గఢ్ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రాహి

శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న వేళ దేవ్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే (MLA Subash Chandra Panigrahi) ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఒడిశా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో (Odisha Assembly) మాట్లాడుతున్నారు.

BJP MLA Subash Chandra Panigrahi (photo-File Image)

Bhubaneswar, Mar13: ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం కలకలం రేపింది. శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న వేళ దేవ్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే (MLA Subash Chandra Panigrahi) ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఒడిశా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో (Odisha Assembly) మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పోడియం వద్దకు చేరుకున్న బీజేపీ దేవ్‌గఢ్ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి (BJP MLA Subash Chandra Panigrahi) తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ బాటిల్ మూత తీసి తాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సభ్యులు ఆయన నుంచి సీసా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.

కాగా ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే ఇది వరకే హెచ్చరించారు. అనుకున్నట్టే ఆత్మహత్యకు యత్నించారు. తన నియోజకవర్గమైన దేవ్‌గఢ్ జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని గత నెల 26న అసెంబ్లీలో మాట్లాడుతూ సుభాష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారని, ప్రభుత్వం కనుక తక్షణం కొనుగోళ్లు చేపట్టకుంటే తాను కూడా అదే పనిచేస్తానని హెచ్చరించారు. నిన్న రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ముందుగా హెచ్చరించినట్టు సుభాష్ ఆత్మహత్యాయత్నం చేశారు.

మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల, వీల్‌ఛైర్‌లోనే ప్రచారం చేస్తానని తెలిపిన దీదీ, కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని పిలుపు, దాడిపై రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన ఈసీ

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బిక్రమ్ కేషరి అరుఖా మరియు ఇతర శాసనసభ్యులు ఎమ్మెల్యే పానిగ్రాహి శానిటైజర్ తాగకుండా నిరోధించగలిగారు. అతని నుండి విష పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. "రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని, రైతులను గాలికి వదిలేసారని. వేరే మార్గం లేక నేను శానిటైజర్ తాగడానికి ప్రయత్నించాను.

రైతుల సమస్యను సభలో ఎప్పటికప్పుడు లేవనెత్తినప్పటికీ, రైతుల దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు" అని పానిగ్రాహి మీడియాకు చెప్పారు. మండిస్ వద్ద దుర్వినియోగం, అలాగే టోకెన్ వ్యవస్థ వంటి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పానిగ్రాహి ఆరోపించారు.