Sikkim: సిక్కింలోనూ బిజేపి జెండా పాతనుందా? ఎమ్మెల్యేలందరూ బిజేపికి షిఫ్ట్, ఒక్కసీటు గెలుచుకోని బిజేపి నేరుగా ప్రతిపక్షం స్థానంలోకి. ఒక్కరోజులోనే అంతా తారుమారు.

నేడు సిక్కింలో ప్రతిపక్షం దాకా వచ్చేసింది.

BJP is now main opposition in Sikkim after 10 Democratic Front MLAs join BJP I Photo: BJP Twitter

Sikkim, 13 Aug:  ఆ రాష్ట్రంలో బిజేపీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య '0'. ఒక్క సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకలేని పరిస్థితి. అలాంటిది ఏకంగా ఒక్కరోజులోనే, ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా నేరుగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పుడు బీజేపి ప్రతిపక్ష స్థానంగా అవతరించింది.

సిక్కిం రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 32. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 'సిక్కిం క్రాంతికారి మోర్చా' పార్టీ 17 అసెంబ్లీ సీట్లు సీట్లు గెలుచుకోగా, 'సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్' పార్టీ 15 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతో 17 సీట్లు గెలుచుకున్న సిక్కిం క్రాంతికారి మోర్చా (Sikkim Kranti Morcha) అతిపెద్ద పార్టీగా అవతరించి మే, 2019న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. 2 సీట్లు వెనకబడ్డ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (Sikkim Democratic Front) పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.

ఆ ఎన్నికల్లో ఒంటరిగా 32 స్థానాలకు పోటీచేసిన బీజేపీ (BJP-Bharatiya Janata Party) ఒక్క స్థానం కూడా గెలుచుకోలే '0' కే పరిమితమైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ కనీసం ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లేకపోయింది. అలాంటింది, ఈరోజు ఆగష్టు 13, 2019న ప్రతిపక్ష పార్టీ అయిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో సిక్కిం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఈ 10 మంది ఎమ్మెల్యేలతో నేరుగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ సంఖ్యాబలం 3 కు పడిపోయింది. (మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్ల గెలుపొందారు కాబట్టి ఆ రెండు స్థానాలు లెక్కలోకి రావు).

రానున్న రోజుల్లో అధికార పార్టీని కూడా కూలదోసి సిక్కి సీఎం కుర్చీపై బీజేపి అభ్యర్థి కూర్చున్న ఆశ్చర్యం ఏమి లేదు. అలా జరిగితే గనుక అసలు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా అధికారం చేజిక్కించుకున్న పార్టీగా బీజేపి నిలిచేదేమో. అయితే రాజకీయ లెక్కలు ఎలా ఉన్నా, నైతికంగా అది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అనిపించుకోదు. బహుశా అందుకేనేమో ప్రస్తుతానికి బీజేపీ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవడానికి మాత్రమే పరిమితమైంది. లేదంటే ప్రస్తుతం అధికారంలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ స్థానాన్ని కబ్జా చేసేదేమో.

ఎంపీ ఎన్నికల్లో రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా తమ జెండా పాతాలని వ్యూహాలను రచిస్తుంది. మొన్నటికి మొన్ననే కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి, బీజేపి అభ్యర్థి యడయూరప్ప సీఎం అయ్యారు. అంతకుముందు గోవాలో కూడా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాగేసుకొని బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిక్కిం వంతు వచ్చింది. దేశంలోని 29 రాష్ట్రాలలో కాషాయ జెండాను ఎగరవేయాలని భావిస్తున్న 'కమల ద్వయం', ఇప్పటికే తమ మిత్రపక్షాలతో కలిసి 17 రాష్ట్రాలను పాలిస్తుంది, ఇప్పుడు ఇప్పుడు సిక్కింలో ప్రతిపక్షం దాకా వచ్చేసింది. ఇక మున్ముందు బీజేపి ఇంకెన్ని రాష్ట్రాలను ఆక్రమిస్తుందో చూడాలి.

ఉత్తర భారతంలో బీజేపీకి అనుకూల వాతావరణమే ఉన్నా, దక్షిణంలో మాత్రం అంత సులభం కాదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలలో స్థానికంగా బలమైన నాయకత్వం ఉండటం చేత ఇక్కడ బీజేపీ 'బల ప్రయోగం' ఇక్కడ పనిచేయదు. కర్ణాటక, గోవా కమలానికి దక్కినా అక్కడ కూడా పరిస్థితులు మళ్లీ తారుమారయ్యే ఛాన్స్ ఇంకా ఉంది. సౌత్ లో అధికారం చేజిక్కించుకోవాలంటే ఎన్నికల సమరంలో తేల్చుకోవాల్సిందే.



సంబంధిత వార్తలు

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు