Who Will Be MAHA CM: అధికారాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన వ్యూహాలు, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్న కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ దారెటు ?
ఎన్నికల ఫలితాల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ- శివసేన (BJP-Sena) కూటముల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అక్కడ అధికార ఏర్పాటు(Maharashtra Govt Formation) అనేది సందిగ్ధంలో పడింది. సీఎం పదవీ కాలం ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో.. అధికారాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బీజేపీని ఆహ్వానించారు.
Mumbai, November 10: మహారాష్ట్ర(Maharashtra)లో అధికార ఏర్పాటు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ- శివసేన (BJP-Sena) కూటముల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అక్కడ అధికార ఏర్పాటు(Maharashtra Govt Formation) అనేది సందిగ్ధంలో పడింది. సీఎం పదవీ కాలం ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో.. అధికారాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బీజేపీని ఆహ్వానించారు.
అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ(Governor Bhagat Singh Koshyari) పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తెలిపింది.
అధికారాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ
ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి మద్దతిచ్చారని, కానీ శివసేన తమను అవమానించిందని బీజేపీ నేతలు మండిపడ్డారు.కాసేపటి క్రితం బీజేపీ నేతలు గవర్నర్ భగత్ సింగ్‌తో కలిసి ఈ విషయాన్ని తెలిపారు.
మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 105 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించగా, 56 స్థానాలతో శివసేన రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఈ కూటమి అధికారాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని సొంతం చేసుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. శివసేన సీఎం పదవీ రెండున్నరేళ్లు కావాలని మెలిక పెట్టడంతో ఇద్దరి మధ్య పొత్తు పొడవలేదు.దీంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ నేతలు గవర్నర్‌కు తెలిపారు.
కాంగ్రెస్-ఎన్సీపీలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యేలతో శివసేన కీలక భేటీ నిర్వహించింది. హోటల్ రిట్రీట్‌లో క్యాంప్ చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలతో శివ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు చేయాలా వద్దా, ఏర్పాటు చేయాలనుకుంటే బల పరీక్షలో ఎలా నెగ్గాలి అనేదానిపై శివసేన నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీ అనంతరం గవర్నర్‌ను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.
రెండవ పార్టీ శివసేనను ఆహ్వానించిన గవర్నర్
ఇదిలా ఉంటే అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీకి శివసేన మద్దతు తెలపకపోతే తర్వాత తాము శివసేనకు మద్దతు ప్రకటిస్తామని ఎన్సీపీ సంకేతాలు ఇచ్చింది. అయితే ముందే తేరుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ కలుస్తాయా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే సీఎం పీఠంపై శివసేన కూర్చోవడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అయితే మద్దతు ఎలా కూడగడతారనేదానిపై మాత్రం ఆయన స్పందించలేదు.
మీడియాతో సంజయ్ రౌత్
ఈ పరిస్థితులు ఇలా ఉంటే సీనియర్ కాంగ్రెస్(Congress) నేత మల్లిఖార్జున్ ఖార్గే జైపూర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండాలని ఆశీర్వదించారని అన్నారు. అక్కడ అధికార ఏర్పాటుపై పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది సభ్యుల బలం ఉండాలి.