UP Elections: ఓటు అడిగేందుకు బాత్రూంలోకి వెళ్లిన ఎమ్మెల్యే, స్నానం చేస్తున్న వ్యక్తిని కూడా వదలరా! ఇదెక్కడి ప్రచారం సామీ! అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
అతను స్నానం చేస్తున్నాడని కూడా వదలకుండా ఇల్లు ఉందా? అంతా ఓకేనా.. అంటూ ప్రశ్నించాడు
Kanpur January 23: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Five states elections) నేపథ్యంలో అభ్యర్ధుల ప్రచారం మొదలైంది. కరోనా కారణంగా రోడ్ షోలు(Ropad shows), భారీ ర్యాలీలు, బహిరంగ సభలు రద్దవ్వడంతో అభ్యర్ధులంతా ఇంటింటి ప్రచారానికే (campaigns )పరిమితమయ్యారు. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధుల పడే పాట్లు అన్నీ...ఇన్నీ కాదు. ఓటర్ల దగ్గర వంగి వంగి దండాలు పెట్టడం, వారిపై వరాల జల్లు కురిపించడం కామన్ అయిపోయింది. అయితే ఉత్తరప్రదేశ్(Uttarapradesh) లో బీజేపీకి చెందిన ఓ అభ్యర్ధి మాత్రం మరింత వైరైటీగా ట్రై చేశాడు.
కాన్పూర్ (kanpur) లోని గోవింద్‌నగర్ ( Govind nager) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున టీ చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర మియాథాని ( Surendra Maithani) ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశాడో తెలుసా? ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడి దగ్గరికి వెళ్లి అతడితో ముచ్చటించడం స్టార్ట్ చేశాడు. అతను స్నానం చేస్తున్నాడని కూడా వదలకుండా ఇల్లు ఉందా? అంతా ఓకేనా.. అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యక్తి సబ్బుతో శరీరానికి రుద్దుకుంటూనే సమాధానం చెప్పడం.. ఆ తర్వాత రేషన్ కార్డు ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నించడం.. దీంతో ఉంది అని అతడు చెప్పడం.. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎమ్మెల్యే ప్రచారానికి సంబంధించిన వీడియోను చూసిన ప్రజలు...అతని పనికి నవ్వుకుంటున్నారు. కొందరైతే ఇప్పుడు వంగి వంగి దండాలు పెడతారు. మనం ఎక్కడున్నా వదలకుండా వచ్చి పలకరిస్తారు. కానీ ఎన్నికలు అయిపోతే మళ్లీ కంటికి కూడా కనిపించరంటూ కామెంట్ చేస్తున్నారు.