CM Capt Amarinder Singh Resigns: పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ రాజీనామా, గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన సింగ్
ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తనతో పాటు తన మంత్రిమండలి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు
New Delhi, September 18: పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా (CM Capt Amarinder Singh Resigns) చేశారు. ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తనతో పాటు తన మంత్రిమండలి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రమవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తున్నట్లు కనిపించే ఫొటోను ఆయన కుమారుడు రణీందర్ సింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీరియస్‌గా ఉన్న కెప్టెన్ అమరీందర్ తన సీఎం పదవికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసిందే. ఇలాంటి అవమానాలతో పార్టీలో కొనసాగలేనని సోనియా గాంధీతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమైన వేళ కెప్టెన్ అమరీందర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నివాసం ముందు అమరీందర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే కెప్టెన్ అమరీందర్‌సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం 5.00 గంటలకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి హరీష్ రావత్ తెలిపారు. పలువురు పంజాబ్ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఏఐసీసీ ఇవాళ సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన ట్వీట్ చేశారు.
Here's ANI Tweet
అయితే, సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్ణయంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసహనం వ్యక్తంచేశారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని వ్యాఖ్యానించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తాజాగా ఆయన రాజీనామా చేశారు.