Chandigarh Mayoral Election Results 2024: చండీగఢ్ మేయర్‌ ఎన్నిక వివాదంలో బీజేపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు, ఆప్ అభ్యర్థే మేయర్ అని స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం

రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి కొట్టివేసి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు ఆప్‌ అభ్యర్థికే పడినట్లు గుర్తించింది.

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

AAP Councillor Kuldeep Kumar Winner of Mayoral Poll: చండీగఢ్ మేయర్‌ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ( Supreme Court) మంగళవారం తెరదించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో (Chandigarh Mayoral Election Results 2024) ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్‌ కుమారే చట్టబద్ధమైన విజేత ( AAP Councillor Kuldeep Kumar Winner of Mayoral Poll) అని నిర్ధారించింది. రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి కొట్టివేసి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు ఆప్‌ అభ్యర్థికే పడినట్లు గుర్తించింది.

బీజేపీ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన ఫలితాలను రద్దుచేసింది.ఈ వివాదానికి కారకుడైన రిటర్నింగ్‌ అధికారి, బీజేపీ మైనారిటీ సెల్‌ మాజీ సభ్యుడు అనిల్‌ మాషిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు అనిల్‌ మాషికి షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు,అభివృద్ధికి అడ్డుగా ఉన్న గోడను బద్దలు కొట్టామని తెలిపిన ప్రధాని

జ‌న‌వ‌రి 30న జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ క‌మార్‌ను ఓడించి మనోజ్‌ సోంకర్‌ మేయ‌ర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మ‌డి అభ్య‌ర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు.ఆప్‌ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మ‌నోజ్ సోంక‌ర్ విజయం సాధించారు. ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు.

ఎన్నికల అధికారి బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి.. వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్‌, ఆప్‌లు ఆరోపించాయి. ఆప్‌ కౌన్సిలర్ వేసిన పిటిషన్‌ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఆ అధికారి బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్‌ పేపర్లను మార్కింగ్‌ చేస్తూ రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్‌ కౌన్సిలర్‌ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచార‌ణ చేపట్టిన నేపథ్యంలో ఆదివారం సోంక‌ర్ మేయర్‌ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. ‘ఈ బ్యాలెట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా..?’ అంటూ మసీహ్‌ను ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థి పేరిట వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు ’ అని వెల్లడించిన సీజేఐ.. ఆ పేపర్లను కోర్టులోని ఇరుపక్షాల న్యాయవాదులకు చూపించారు. అలాగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోను మరోసారి వీక్షించారు.

మాసిహ్‌ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ.. లెక్కింపు వీడియోను మరోసారి ప్లే చేయమన్నారు. ‘అందరినీ ఈ వీడియో చూడనివ్వండి. జీవితంలో వినోదం మంచిదే. అయితే కౌంటింగ్ వీడియో మొత్తం వేయాల్సిన పనిలేదు. అంతా వేస్తే.. సాయంత్రం 5.45 గంటల వరకు ఇక్కడే ఉంటాం’ అని సరదాగా మాట్లాడారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif