జమ్మూ కశ్మీర్‌లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు.ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ(BJP) ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సమతుల్య అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు. ఈరోజు వందలాది మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశామని మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌ ఈ వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్న సంతృప్తి ఉందన్నారు.జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 (Article 370) ని రద్దు చేసినందుకుగాను.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలువడంలో ఇక్కడి ప్రజలు తమవంతు పాత్ర పోషించాలని ప్రధాని కోరారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)