'My Silence Isn't Weakness': మహారాష్ట్రకు చెడ్డ పేరు తీసుకువచ్చే కుట్ర, మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు, అన్నింటికీ సరైన సమయంలో స్పందిస్తానని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించడం యొక్క ప్రాముఖ్యత, అన్‌లాక్ పరిస్థితులు, మరాఠా రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం మరియు పోరాడటానికి వ్యూహం వంటి అనేక విషయాల గురించి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. మాజీ నేవీ అనుభవజ్ఞుడు మదన్ శర్మపై దాడి, శివసేన వర్సెస్ కంగనా రనౌత్ (Kangana Ranaut vs Shiv Sena) గొడవ వంటి విషయాలపై మహా సీఎం స్పందించారు.
Mumbai, Sep 13: దాదాపు మూడు నెలల తర్వాత రాష్ట్రాన్ని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే (CM Uddhav Thackeray) ప్రసంగించారు. కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించడం యొక్క ప్రాముఖ్యత, అన్‌లాక్ పరిస్థితులు, మరాఠా రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం మరియు పోరాడటానికి వ్యూహం వంటి అనేక విషయాల గురించి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. మాజీ నేవీ అనుభవజ్ఞుడు మదన్ శర్మపై దాడి, శివసేన వర్సెస్ కంగనా రనౌత్ (Kangana Ranaut vs Shiv Sena) గొడవ వంటి విషయాలపై మహా సీఎం స్పందించారు.
మహారాష్ట్రకు చెడ్డపేరు తెచ్చే కుట్ర జరుగుతున్నదని సీఎం ఉద్ధవ్ థాకరే (Maharashtra Chief Minister Uddhav Thackeray) ఆదివారం ఆరోపించారు. రాజకీయ తుఫాన్లను ఎదుర్కొనే సామర్థ్యం తనకు ఉన్నదని ఆయన చెప్పారు. కంగనా-శివసేన వివాదం, సుశాంత్ సింగ్ మరణం కేసు, డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్ట్, రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసిన మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడి వంటి ఘటనలపై పరోక్షంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో కొన్ని రోజులుగా రాజకీయాలకు సంబంధమైన పలు తుఫాన్లు ఏర్పడుతున్నాయని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తనకు ఉన్నదని ఉద్ధవ్ థాకరే అన్నారు. కొంతమంది కరోనా ముగిసింది, ఇక రాజకీయాలు చేయెచ్చు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అయితే ఇలాంటి రాజకీయాల గురించి తాను మాట్లాడబోనని సీఎం చెప్పారు. మహారాష్ట్రకు చెడ్డపేరు తెచ్చేందుకు ఇవన్నీ జరుగుతున్నాయని, తన మౌనం వాటికి సమాధానం లేకపోవడం (My Silence Isn't Weakness) కాదన్నారు. సరైన సమయంలో దీనిపై స్పందిస్తా.’’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై సరైన సమయంలో స్పందిస్తానని, ‘సీఎం ప్రోటోకాల్’ ను పక్కనెట్టి మరీ మాట్లాడతానని ఆయన తీవ్ర స్వరంతో పేర్కొన్నారు.
మరాఠా రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై కరోనా సంక్షోభంలో నిరసనలకు దిగవద్దని మహారాష్ట్ర వాసులకు సీఎం ఉద్ధవ్ పిలుపునిచ్చారు. మరాఠా రిజర్వేషన్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని ఉద్ధవ్ భరోసా ఇచ్చారు. మీ డిమాండ్‌ను ప్రభుత్వం తీర్చుతుందని, ప్రజలు సహనం వహించాలని ఆయన కోరారు.
కరోనా నేపథ్యంలో ఈనెల 15 నుంచి నా కుటుంబం - నా బాధ్యత’ అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైద్యాధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని ఆయన తెలిపారు. డిసెంబర్, జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, దానికి అందరూ సహకరించాలని ఉద్ధవ్ విజ్ఞప్తి చేశారు.