బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి బీఎంసీ షాకిచ్చింది. బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(BMC) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని (Kangana Ranaut's Office Demolished) చేపట్టినట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి కంగనాకు నోటీసులు సైతం పంపించారు. అయితే ఆ సమయంలో కంగనా అక్కడ లేరు. ఆమె ముంబై చేరుకునే లోపే ఆమె కార్యాలయాన్ని కూల్చారు.
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం (Kangana Ranaut vs Shiv Sena) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై (Maharahstra Govt) కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది.
ముంబైని పీవోకేతో కంగనా పోల్చడం.. కంగనా ముంబైకి రావద్దని శివసేన నుంచి బెదిరింపులు రావడం.. దానికి కంగనా ముంబైకి వచ్చి తీరుతానని సవాల్ చేయడం తెలిసిందే. కాగా, చెప్పినట్లుగానే ఈరోజు కంగనా ముంబైకి చేరుకుంది. అయితే ముంబై ఎయిర్‌పోర్టు వద్ద నల్లజెండాలతో శివసేన కార్యకర్తలు ఆమెకు నిరసన తెలిపారు. మరోవైపు కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు కంగనాకు మద్దతుగా నిలిచారు. భారీ భద్రత మధ్య కంగనాను వీఐపీ మార్గం ద్వారా ఎయిర్‌పోర్టు నుంచి ఆమెను తరలించారు.
Shiv Sena Slammed
Ironically most Shivsena Shaka in Mumbai are constructed illegally- Dual Face -#DeathOfDemocracy
— Nilotpal Mrinal (@nilotpalm3) September 9, 2020
కాగా కొద్ది రోజులుగా శివసేన, కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా ముంబైని పీవోకే అని వ్యాఖ్యానించడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డ శివసేన ఆమెను ముంబైలో అడుగు పెట్టొద్దని శివసేన హెచ్చరికలు చేసింది. ఐ హెచ్చరికలతో కంగనాకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది.
BMC Not Quick to Respond in These Matters?
#DeathOfDemocracy Corrupt @mybmc has no time to do something of these Potholes but have so much time to bully a girl who raised her voice against their Maalik Aurangzeb @OfficeofUT #DeathOfDemocracy pic.twitter.com/CmMFTL6jWi
— अभिलाष दीक्षित ( बाबा ) (@Abhilas28998486) September 9, 2020
Mumbai's Monsoon Situation - Courtesy (BMC)
BMC has no time to find solutions of monsoon problems they have enough time to break the dream (Dream Homes) #DeathOfDemocracy pic.twitter.com/QTrzSCZEj8
— Chotu Malik (@ChotuMalik333) September 9, 2020
‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు’ అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ‘ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్. గుర్తుంచుకోండి. బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు.
Unauthorised Construction Site
According to BMC, these cramped unauthorised colonies are legal but #Kangana’s office is illegal.
It is nothing but a blatant use of power!! Sab yaad rakha jayega naughty guys. #DeathOfDemocracy#KanganaVsSena pic.twitter.com/uK5VW6N8AS
— MAYANK CHAUDHARY (@IamMayank_) September 9, 2020
Road Under BMC and Actress' Office on the Other Hand!
Pic 1 - This is what BMC and Maha Govt should be Doing ...Filling up Pot holes
Pic 2 - This is what BMC and Maha Govt is doing Breaking office of @KanganaTeam and satisfying personal egos and hiding failures
Sad Day for A fabulous city called Mumbai#DeathOfDemocracy pic.twitter.com/3QPeRcpHSP
— Abhimanyu Singh Rathour 🇮🇳 (@abhimanyuBJPmp) September 9, 2020
నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేసింది. నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు. మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకు ఈరోజు ఆర్థమైంది’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది.
దీనిపై బీఎంసీ మేయర్ కిషోర్ పెడ్నేకర్ మాట్లాడుతూ, ‘ కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈ పని చేసిది శివసేన పార్టీ కాదు, బీఎంసీ. ఫిర్యాదు అందిన తరువాత మేం భవానాన్ని కూల్చివేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కంగనా తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది.
ఆమెకు అనవసరమైన ప్రచారాన్ని ఇచ్చింది : శరద్ పవార్
ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేత చర్య ఆమెకు అనవసరమైన ప్రచారాన్ని ఇచ్చిందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియా కవరేజీపై తనకు అభ్యంతరం ఉందన్నారు. అనవసరమైన విషయాన్ని మీడియా పెద్దది చేసి చూపించిందని, ఇలాంటి వాటిని విస్మరించాలని ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో పేర్కొన్నారు. బృహన్ ముంబై మున్నిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిబంధనల ప్రకారమే నటి భవనాన్ని కూల్చివేసిందన్నారు. అయితే ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశంగా వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక ముంబైలో అక్రమ కట్టడాలు కొత్త విషయం కాదని, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నటి కార్యాలయం కూల్చివేత పలు సందేహలకు దారి తీసిందని పవార్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ట్విట్టర్లో #UddhavWorstCMEver , #ShameOnMahaGov, #DeathOfDemocracy అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. అందరూ కంగనాకు మద్దతుగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు.