Sanjay Raut and Kangana Ranaut (photo CRedit: Facebook)

Mumbai, September 6: బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు (Kangan Comments) చేసిన కంగనా రనౌత్‌ ముంబై నగరం మరో పాకిస్తాన్ (Mini Pakistan) అంటూ వివాదాస్పవ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. కాగా ఆమె సుశాంత్ డెత్ కేసులో ముంబై పోలీసులపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో వేడిని రాజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, దయచేసి ఆమెను ముంబై రావద్దని కోరుతున్నామని సామ్నాలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) రాసుకొచ్చారు.

దీనిపై హోం శాఖ చర్యలు తీసుకోవాలని రౌత్‌ పేర్కొన్నారు. సుశాంత్‌ మృతి కేసుపై ముంబై పోలీసుల పనితీరును గతంలోనూ పలుమార్లు కంగనా ప్రశ్నించారు. సుశాంత్‌ మరణించిన అనంతరం బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఇతరులతో పోలిస్తే స్టార్‌ కిడ్స్‌ను ప్రోత్సహించే సంస్కృతిపై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడకం మామూలేనని కంగనా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. నార్కోటిక్స్‌ బ్యూరో విచారణ చేపడితే బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు జైలు ఊచలులెక్కపెడతారని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల అనంతరం కంగనా ముంబై నగరాన్ని పీఓకేతో పోలుస్తూ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సంజయ్‌ రౌత్‌ బెదిరింపుల నేపథ్యంలో ముంబై నగరం తనకు ఇప్పుడు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆమె ఓ మెంటల్ కేసు... తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నాయి. ముంబై నగరాన్ని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదు. ముంబై, మహారాష్ట్రను కించపరచడాన్ని తాము సహించం’’ అని రౌత్ వ్యాఖ్యానించారు.

ట్విస్టులతో సాగుతున్న సుశాంత్ డెత్ కేసు, రియా చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు, విచారణకు హాజరకావాలని ఆదేశించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

నటి కంగనా రనౌత్ మహారాష్ట్రకు క్షమాపణలు చెబితే అప్పుడు ఆమెకు క్షమాపణలు చెప్పే విషయంపై ఆలోచిస్తానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆమె ముంబైను పాకిస్తాన్ అని అన్నారని, అదే వ్యాఖ్యలు అహ్మదాబాద్‌పై అనే దమ్ముందా? అని రౌత్ సూటిగా ప్రశ్నించారు.

ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సైతం కంగనా తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెడు అభిప్రాయముంటే కంగనా ముంబైకి రావొద్దు అన్నారు. ఈ క్రమంలోనే కంగనా హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యాఖ్యలపై కంగనా ఎదురుదాడికి దిగారు. అతన్ని తాలిబన్‌తో పోలుతూ వివాదాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టారు.

అంతేకాకుండా ‘ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా’ అంటూ సవాల్‌ విసిరారు. అయితే కంగనా తాజా వివాదం వెనుక రాజకీయ పార్టీ అండ ఉందని శివసేన నేతలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అండదండలతోనే ఆమె ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని సేనలు విమర్శిస్తున్నారు. మరాఠాను కించపరిస్తే ఏమాత్రం సహించమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో కంగనాకు వ్యతిరేకంగా నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.