Delhi Assembly Elections 2020: నెలకు రూ.7.500 నిరుద్యోగ భృతి, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల మంచి నీరు ఉచితం, ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఢిల్లీలో మేనిఫెస్టోని (Congress Manifesto) విడుదల చేశారు.

Congress leaders unveil manifesto for Delhi assembly elections (Photo Credits: Twitter)

New Delhi, February 3: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections 2020) సంబంధించి కాంగ్రెస్ పార్టీ (Congress) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఢిల్లీలో మేనిఫెస్టోని (Congress Manifesto) విడుదల చేశారు.

మేనిఫెస్టో విడుదల సందర్భంగా సుభాష్ చోప్రా మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 300యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. అంతేకాకుండా ప్రతిఏటా 25శాతం బడ్జెట్ ను కాలుష్యంపై పోరాడటానికి,రవాణ సౌకర్యాలు మెరుగుపర్చడానికి ఖర్చు చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇవ్వగా... దానికి ప్రతిగా కాంగ్రెస్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మాటిచ్చింది. ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది.

ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ

ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని తెలిపింది.ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు రూ.5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున ప్రతి నెలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఈ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది.

ఆప్ పార్టీ  మేనిఫెస్టో

ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను (NPR, NRC) అమలు చేసేది లేదు' అని పేర్కొంది. సుప్రీంకోర్టులో సీఏఏను (CAA) సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు.

నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని

గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఢిల్లీలో ఓటింగ్ శాతంలో బీజేపీ తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ జోరు ఈ సారి అంతగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనబడటం లేదు. ఫిబ్రవరి-4న జంగ్ పురా,సంగమ్ విహార్ ప్రాంతాల్లో,ఫిబ్రవరి-5,2020న కొండ్లి,హౌజ్ ఖాజీ ఏరియాల్లో నిర్వహించే ర్యాలీల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ప్రచార ర్యాలీల్లో పాల్గొననుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ప్రచారం నిర్వహించనున్నారు.

అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢిల్లీలో ఖాతా కూడా తెరవలేకపోయింది. అప్పుడు బీజేపీ కేవలం 3సీట్లతో సరిపెట్టుకోగా...మొత్తం 70స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67సీట్లు వచ్చాయి. ఇక ఈసారి తమ సంఖ్య పెంచుకొని అధికారం చేపడతామని బీజేపీ అంటుండగా,ప్రజలు తమవైపే ఉన్నారని కేజ్రీవాల్ అంటున్నారు. ఇక దశాబ్దాలపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది.