
New Delhi, January 31: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను (BJP Election Manifesto)విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ (Manoj Tiwari) నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఆప్ (AAP) పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి విదితమే.
నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని
హెల్త్‌కేర్, అభివృద్ధి, వాయుకాలుష్య నివారణ (Clean Air) ప్రధాన అజెండాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలపై మీడియాతో నితిన్ గడ్కరి (Nitin Gadkari) మాట్లాడుతూ, పర్యావరణంపై ప్రధానంగా తమ పార్టీ దృష్టి పెడుతుందన్నారు.
అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్
ఢిల్లీ (Delhi) వాసులందరికీ స్వచ్ఛమైన తాగునీరు (Clean water) అందిస్తామని వాగ్దానం చేశారు. ఢిల్లీ ప్రజలు వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని సమర్ధవంతంగా పరిష్కరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని చెప్పారు.
Here's BJP Manifesto
केंद्रीय मंत्री श्री नितिन गडकरी व भाजपा के अन्य वरिष्ठ नेता दिल्ली विधानसभा चुनाव 2020 के लिए 'संकल्प पत्र' जारी करते हुए। #DeshBadlaDilliBadlo pic.twitter.com/o8uaizwG7Q
— BJP (@BJP4India) January 31, 2020
16 లేన్ల హైవేతో పాటు ఢిల్లీలో మరిన్ని యూనివర్శిటీలకు నెలకొల్పుతామని అన్నారు. ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉందన్నారు. సంకల్ప పత్రంలో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని, బీజేపీని గెలిపించాలని గడ్కరి పేర్కొన్నారు.
Here's BJP Tweet
मुझे खुशी है कि 28 अगस्त, 2018 को छह राज्यों के सभी मुख्यमंत्रियों को बुलाकर विवाद को सुलाझाए गए: श्री @nitin_gadkari #DeshBadlaDilliBadlo pic.twitter.com/injdmCcpLx
— BJP (@BJP4India) January 31, 2020
ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో కనీసం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీ బీసీ, అగ్రవర్ణ పేదల కోసం వేర్వరుగా డెవెలప్మెంట్ బోర్డలు, పిల్లల పెళ్లిళ్ల కోసం ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం, ఢిల్లీ-యమునా వికాస్ బోర్డు, 20 సూత్రాల పథకంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్, స్టార్ట్ అప్ లకు పోత్సాహంతోపాటు ఫిట్ ఇండియా-ఫిట్ ఢిల్లీ పథకాన్ని అమలు చేస్తామనీ బీజేపీ నేతలు తెలిపారు.
ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం:అమిత్ షా
పార్టీ ‘విజన్’ గురించి మనోజ్ తివారీ వివరించగా.. తమ పార్టీ ఆధ్వర్యంలోని మోదీ ప్రభుత్వం ఈ నగర అభివృద్దికి చేబట్టిన వివిధ ప్రాజెక్టులపై నితిన్ గడ్కరీ ప్రస్తావించారు.
ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
తాము అధికారంలోకి వస్తే.. ఆయుష్మాన్ భారత్ యోజనను అమలు చేస్తామని, హయ్యర్ సెకండరీ స్కూలు విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా అందజేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు.రెండు రూపాయలకే కేజీ గోధుమపిండి, ప్రతి ఇంటికీ శుధ్ధమైన నీటిని అందిస్తామని తెలిపింది. కొత్తగా 200 స్కూల్లు, 10 కాలేజీలూ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షాలకు షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఐదేళ్ల పాలనలో ఢిల్లీ అన్నిరకాలుగా వెనుకబడిపోయిందని, కేజ్రీవాల్ కేబినెట్ లోని మంత్రుల్లో సగంమందికిపైగా చీటింగ్, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారేనని, అభివృద్ధి పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతో ‘‘మేరా ఢిల్లీ.. మేరా సుజావ్'' కాన్సెప్ట్ తో పాలన సాగిస్తామని, జల, వాయికాలుష్య రహిత నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని బీజేపీ నేతలు వాగ్దానం చేశారు.