Delhi Assembly Elections 2020: ఢిల్లీలో ఈ సారి పాగా వేసేదెవరు?, అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది, 2వసారి ఆప్ అధికారంలోకి వస్తుందా?,బీజేపీ చరిత్రను తిరగరాస్తుందా?, ఫిబ్రవరి 8న పోలింగ్, 11న ఎన్నికల ఫలితాలు
Delhi Assembly Elections 2020 -Amit shah vs Aravind kejriwal (Photo-PTI)

New Delhi, January 6: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా(Delhi Assembly Elections 2020) మోగింది. వచ్చే నెల 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా(EC Chief Sunil Arora) ప్రకటించారు. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.

ఢిల్లీలో(Delhi) మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.13, 750 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒకే దశల్లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.

Total Number of Registered Voters in Delhi

80 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకోని వారికి తొలిసారిగా గెైర్హాజరీ విధానాన్ని తీసుకొస్తున్నట్టు ఈసీ వెల్లడించింది. అనారోగ్య కారణాలు, అనివార్య కారణాల వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వారికి ఇది ఉపకరిస్తుందని ఈసీ పేర్కొంది.

ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం:అమిత్ షా

కాగా ఈ ఏడాది దేశంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలే కావడం విశేషం. 2015లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)67 చోట్ల విజయం సాధించింది. మిగతా మూడు స్థానాల్లో బీజేపీ(BJP) గెలవగా కాంగ్రెస్‌కు(Congress) ఒక్క సీటు కూడా దక్కలేదు.

ఈ సారి చరిత్ర పునరావృతం కాకూడదనే పట్టుదలతో బీజేపీ పనిచేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ తీయడానికి పావులు కదుపుతోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లనూ బీజేపీ కొల్లగొట్టింది. అదే తరహా ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయడానికి బీజేపీ సరికొత్త ఎత్తులను వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఢిల్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్

ఇదిలా ఉంటే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జార్ఖండ్ లో 14 లోక్ సభ స్థానాలకు 12 సీట్లను కైవసం చేసుకుని కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయిన సంగతి విదితమే. అదే తరహా ఫలితాలు ఢిల్లీలోనూ కనిపిస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ అంచనా వేస్తోంది. పైగా- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీవాసులు గళమెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎన్నికల వాతావరణం అంతా తమకు అనుకూలంగా ఉందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. దేశ రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం తమ పార్టీకి అనుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. `అచ్ఛే బీతే పాంచ్ సాల్.. లగేరహో కేజ్రీవాల్..` అనే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు.

Details of EC Schedule For Delhi Elections 2020

నోటిఫికేషన్ తేదీ : 2020, 14 జనవరి

నామినేషన్లు స్వీకరణ తేదీ : 2020, జనవరి 14

నామినేషన్లకు తుది గడువు : 2020, జనవరి 21

విత్ డ్రా చివరి తేదీ : 2020, జనవరి 21

పోలింగ్ : 2020, ఫిబ్రవరి 08

కౌంటింగ్ : 2020,. ఫిబ్రవరి 11