Ranchi, December 29: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం (Hemant Soren Takes Oath As Jharkhand CM) చేశారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా (Governor Draupadi Murmu) ఆయనచే ప్రమాణం చేయించారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (Hemant Soren) బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చాలా కాలం తరువాత దేశంలో ప్రతిపక్షాల ‘ సమైక్యత ‘ కనిపించింది.ఆయన ఈ రాష్ట్ర సీఎం గా పదవి చేపట్టడం ఇది రెండో సారి. హేమంత్ తో బాటు మరో ఇద్దరు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు.
రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ముఖ్యమంత్రులు కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గెహ్లెట్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా. లోక్ తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితరులంతా హాజరయ్యారు.
Hemant Soren took oath as the 11th Chief Minister of Jharkhand
Jharkhand Mukti Morcha leader Hemant Soren took oath as the 11th Chief Minister of #Jharkhand.
Governor Draupadi Murmu administered the oath of office and secrecy to Mr Soren at Morhabadi grounds in Ranchi. pic.twitter.com/dadeSmNkia
— All India Radio News (@airnewsalerts) December 29, 2019
ఈ సందర్భంగా వారంతా సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి.
Update by ANI
Jharkhand: Former Jharkhand CM Raghubar Das at the oath-taking ceremony of Jharkhand CM designate Hemant Soren, in Ranchi. pic.twitter.com/NjBY0wvKMN
— ANI (@ANI) December 29, 2019
మాజీ సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ కూడా ఈ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో ఓ కొత్త శకానికి నాంది పలుకుతున్న ‘ సంకల్ప్ దివస్ ‘ గా ఈ రోజును నేతలు అభివర్ణించారు. అంతకు ముందు ఈ ఉదయం హేమంత్ సొరేన్.. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ప్రజలను కోరుతూ ట్వీట్ చేశారు. ఇది చరిత్రాత్మక ఘటన అని పేర్కొన్నారు.
ANI Tweet
Jharkhand: Rahul Gandhi, Rajasthan CM Ashok Gehlot, Chhattisgarh Chief Minister Bhupesh Baghel & DMK President MK Stalin at the oath-taking ceremony of Jharkhand CM designate Hemant Soren, in Ranchi. pic.twitter.com/PAebDpNypK
— ANI (@ANI) December 29, 2019
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. ఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి.
ఇటీవలి ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. (రాష్ట్ర అసెంబ్లీలో 81 మంది సభ్యులున్నారు). హేమంత్ సొరేన్ మళ్ళీ ఝార్ఖండ్ సీఎం గా అధికార పగ్గాలు చేబట్టడానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌తో బాటు క్రియేటివ్ సోషల్ మీడియా కూడా ఎంతగానో కృషి చేశాయి.