Delhi Assembly Elections 2020: ప్రతిపక్షాలకు షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్, 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల ఎంపిక, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లిస్ట్ నుంచి అవుట్, 8 మంది మహిళలకు అవకాశం
Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: IANS)

New Delhi, January 15: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ(Aam Aadmi Party)) విడుదల చేసింది.

న్యూఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పోటీ చేస్తుండగా మనీష్‌ సిసోడియా పట్పర్‌గంజ్‌ (Manish Sisodia From Patparganj)అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. చాందినీ చౌక్ నుంచి పర్లాద్ సింగ్ సాహ్నీ, డ్వార్కా నుంచి వినయ్ కుమార్ మిశ్రా, గాంధీనగర్ నుంచి దీపూ చౌదరి పోటీ చేయనున్నారు. మనోజ్ కుమార్ స్థానంలో కోండ్లి నుంచి పార్టీ అధికార ప్రతినిధి కులదీప్ కుమార్‌కు ఆప్ టికెట్ ఇచ్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ ఇదే 

ఇదిలా ఉంటే ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం (Delhi CM)అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజే.. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చారు.

Here's the List of Candidates:

సిట్టింగ్‌ల్లో 15 మందికి టికెట్‌ ఇచ్చేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు. 46 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్‌ కేటాయించారు. 2015లో 6గురు మహిళలకు టికెట్‌ కేటాయించిన ఆప్‌.. ఈ సారి 8 మందికి అవకాశం కల్పించింది.

కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్, 2020లో ఆప్ విజయకోసం వ్యూహాలకు పదును

పోలింగ్‌ కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. దేశ రాజధానిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ,(BJP) ఆప్‌,(AAP) కాంగ్రెస్‌లు(Congress) పావులు ఇప్పి నుంచే కదుపుతున్నాయి.

అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్

ఈ మేరకు ట్విట్టర్‌లో (Twitter)ఆమ్ ఆద్మీ పార్టీ.. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. అందరూ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులంతా వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజల ఆశీర్వదంతో గెలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

Arvind Kejriwal  wishes Tweet

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ కూడా ఏమరపాటుగా ఉండొద్దని, గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని అన్నారు. ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీపై, మీ(అభ్యుల)పై నమ్మకముందని తెలిపారు. గాడ్ బ్లెస్ అంటూ ట్వీట్ ముగించారు.