Delhi Exit Poll 2020: చీపురు కమలాన్ని ఊడ్చి పారేయనుందా.., మళ్లీ సీఎం పీఠం కేజ్రీవాల్‌దేనా.., సంచలనం రేపుతున్న ఎగ్జిట్ పోల్స్, ఆప్ 40 నుంచి 50 సీట్లు గెలుచుకునే అవకాశం,

గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ (Delhi Assembly Polls 2020) ఎట్టకేలకు అయిపోయింది. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు ఇప్పుడు ఓటరు తీర్పు ఎవరికి ఇచ్చారోనని ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు బయటకు వచ్చాయి. ఈ సర్వేల ప్రకారం చూస్తే మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ సర్కార్ దేనని స్పష్టం చేస్తున్నాయి.

Poll of exit polls predict an AAP victory | (Photo Credits: IANS)

New Delhi, February 8: గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ (Delhi Assembly Polls 2020) ఎట్టకేలకు అయిపోయింది. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు ఇప్పుడు ఓటరు తీర్పు ఎవరికి ఇచ్చారోనని ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఈ పోల్స్ మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ సర్కార్ దేనని స్పష్టం చేస్తున్నాయి.

దేశ ప్రధానిగా మోదీ, ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) అని ఓటర్లు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్‌కే (AAP) పట్టం కడతారని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చి చెప్పాయి. కాకుంటే, 2015 ఎన్నికల మాదిరిగా భారీ స్థాయి మెజార్టీ రాకపోవచ్చునని అంచనా వేశాయి.

వివిధ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను సమీక్షించి చూస్తే అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) 40 నుంచి 50 స్థానాలను గెలుచుకోవచ్చునని, బీజేపీకి (BJP) 10 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఈసారి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక చతికిలపడుతుందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఓట్ల శాతంలో రెండో స్థానంలో నిలిచింది.

ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ

బీజేపీ పార్టీ మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే జాతీయ భద్రత, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల్ని పదే పదే ప్రస్తావించి, వారికి మద్దతిచ్చిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

ఆప్ పార్టీ  మేనిఫెస్టో

సీఎం కేజ్రీవాల్‌ మాత్రం తన సొంత సంక్షేమ ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అయిదేళ్లలో తాను చేసిన సుపరిపాలననే నమ్ముకుని సంయమనంతో వ్యవహరించారు. షహీన్‌బాగ్‌ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ‘మీరు గెలిస్తే సీఎం ఎవరు’అంటూ సవాల్‌ విసిరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు వంటివి కేజ్రీవాల్‌పై క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కుటుంబ రాజకీయాలు దాన్ని ఇంకా వీడినట్లుగా కనపడటం లేదు. పైగా చివరి వరకు సీట్ల విషయంలో అయోమయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు కాంగ్రెస్ వైపు చూడలేదని తెలుస్తోంది. ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.

Manoj Tiwari Tweet

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలన్నీ ఆప్‌ వైపే మొగ్గుచూపుతుండగా బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ మాత్రం.. తమ పార్టీ క్లీన్‌స్వీప్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు నాడిని అంచనా వేయడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 48 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు.

Here's Manish Sisodia Tweet

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ రానుందని ఆప్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను ఆయన ట్విట్టర్‌ ద్వారా అభినందించారు.

61.46% పోలింగ్‌ నమోదు

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రానికి 61.46% పోలింగ్‌ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్‌ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

సీఎం కేజ్రీవాల్‌ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. కొన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నందున పోలింగ్‌ శాతం పెరిగే చాన్సుందని అధికారులు తెలిపారు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్‌ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్‌ నమోదైంది. పెట్రోలింగ్, క్విక్‌ రెస్పాన్స్‌ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now