Father-Son Chief Ministers: తండ్రీ కొడుకులిద్దరూ సీఎంలే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలలో సీఎంలుగా తండ్రి కొడుకులు, పూర్తి లిస్ట్ పై ఓ లుక్కేసుకోండి

ఆయన తండ్రి కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంలుగా (Father-Son Chief Ministers) చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

Father-Son Chief Ministers (Photo-PTI)

Mumbai, July 28: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం (Basavaraj Bommai is new Karnataka CM) చేశారు. ఆయన తండ్రి కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంలుగా (Father-Son Chief Ministers) చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. బసవరాజు తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మాయ్ 1996-98లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. వీరే కొత్త కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో తండ్ర కొడుకులు సీఎంలుగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎం కరుణానిధి 1969-2011 సంవత్సరాల మధ్య ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు సీఎం పీఠాన్ని కైవసం చేసుకొని తండ్రి కరుణానిధి బాటలో పయనించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. అతని కుమారుడు జగన్ మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. తండ్రీ కొడుకులు సీఎం అయిన వివరాలు ఓ సారి పరిశీలిస్తే..

కర్నాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం, 19 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయనున్న కొత్త సీఎం, 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు

HD Deve Gowda and HD Kumaraswamy

కర్ణాటక నుంచి దేవేగౌడ 14 వ ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిసెంబర్ 1994 నుండి మే 1996 వరకు ఆయన సీఎంగా కొనసాగారు, ఆ తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ప్రధాని అయ్యారు. ప్రధానమంత్రిగా, దేవేగౌడ జూన్ 1996 నుండి 1997 ఏప్రిల్ వరకు పదవిలో ఉన్నారు. అదే సమయంలో, అతని కుమారుడు కుమారస్వామి రెండు పర్యాయాలు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు, ఇది జూలై 2019 లో కూలిపోయింది. యెడియరప్ప తిరిగి రావడానికి మార్గం సుగమం చేసింది.

M Karunanidhi and MK Stalin:

తమిళనాడులో, డిఎంకె అధినేత కరుణానిధి 1969 మరియు 2011 మధ్య ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అతని కుమారుడు స్టాలిన్ ప్రస్తుత మరియు మొదటిసారి సిఎంగా ఎన్నికయ్యారు; స్టాలిన్ నాయకత్వంలో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో DMK -ప్రత్యర్థులు AIADMK నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

YS Rajasekhara Reddy-YS Jagan Mohan Reddy:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. అతని కుమారుడు జగన్ మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు.

Biju Patnaik-Naveen Patnaik:

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ రెండుసార్లు సీఎంగా పనిచేశారు. బిజూ కుమారుడు నవీన్ పట్నాయక్ ఐదు పర్యాయాలు సీఎం అయ్యారు.

Shibu Soren-Hemant Soren:

జార్ఖండ్ సీఎంగా షిబూ సోరెన్ మూడు సార్లు పనిచేయగా అతని కుమారుడు హేమంత్ సోరెన్ రెండవసారి సీఎం అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో తండ్రి డోర్జీ ఖండు, పెమాఖండులు సీఎంలుగా పనిచేశారు.

Mulayam Singh Yadav-Akhilesh Yadav:

ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సిఎం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ మూడు పర్యాయాలు యూపీ సీఎం కుర్చీలో ఉన్నారు. 2012-17లో అఖిలేష్ ఒకేసారి సీఎం పదవిలో ఉన్నారు.

శంకరరావు చవాన్,అతని కుమారుడు అశోక్ చవాన్ మహారాష్ట్రలో సీఎంలుగా పనిచేశారు. మేఘాలయలో పీఏ సంగ్మా, కాన్రాడ్ సంగ్మాల తండ్రికొడుకులు ఉన్నత పదవులు నిర్వర్తించారు.జమ్మూకశ్మీరులో ఫరూఖ్ అబ్దుల్లా, అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లాలు, ముఫ్తీ మహ్మద్ సయీద్, మెహబూబా ముఫ్తీలు సీఎంలుగా పనిచేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ తండ్రి హేమ్వతి నందన్ బహుగుణ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవి లాల్ , అతని కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా హర్యానా సీఎంలుగా పనిచేశారు. అరుణాచల ప్రదేశ్ లో తండ్రి కొడుకులు డోర్జ్ ఖండు, ప్రమ్ ఖండులు సీఎంలుగా పనిచేశారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్