CM Nitish Kumar on PM Modi: 2024లో బీజేపీ గెలుపుపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, ప్రధానిగా తాను రేసులో ఉండనని వెల్లడి
2024 ఎన్నికల్లో గెలుపొందటంపై ఆందోళన ( But Should Worry About 2024) పడాలన్నారు. 2014 మాదిరిగా 2024లో గెలుస్తారా? అని ప్రశ్నించారు.
Patna, August 18: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్‌జేడీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలతో కలిసి ప్రభుత‍్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే వర్గానికి విపక్ష నేతగా మారిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల బాణాలు (CM Nitish Kumaron PM Modi) ఎక్కుపెట్టారు. 2014లో గెలుపొందిన ప్రధాని మోదీ.. 2024 ఎన్నికల్లో గెలుపొందటంపై ఆందోళన ( But Should Worry About 2024) పడాలన్నారు. 2014 మాదిరిగా 2024లో గెలుస్తారా? అని ప్రశ్నించారు.
బీజేపీని వీడాలని పార్టీ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమని 2024 వరకు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్లు ఏం కావాలో చెప్పగలరు. కానీ,2014లో అధికారంలోకి వచ్చిన వారు.. 2024లోనూ విజయం సాధిస్తారా? 2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నా. 2020లో ముఖ్యమంత్రిగా ఉండాలనుకోలేదు. ఒత్తడి చేసి సీఎంను చేశారు. అందుకే మీతో మాట్లాడలేకపోయాను. 2015లో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. అదే బీజేపీతో కలిసి ఉండటం వల్ల 2020లో ఎన్ని తగ్గాయి.’ అని పేర్కొన్నారు నితీశ్. మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉండే అంశాన్ని తోసిపుచ్చారు.
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం,డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం
ఇక జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్‌కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్‌లో గత పదేళ్లుగా రాజకీయ అస్థిరత యుగం కొనసాగుతోందని, ప్రస్తుత పరిణామాలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. దీనికి నితీష్ కుమార్ ప్రధాన పాత్రధారి, సూత్రధారి అని చెప్పారు. 2013 నుంచి బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇది 6వ ప్రయత్నమని అన్నారు. ఒకరి రాజకీయ లేదా పరిపాలనా అంచనాలు నెరవేరనప్పుడు నిర్మాణాలు మారుతాయని వ్యాఖ్యానించారు.
అయితే కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లుగా నితీష్ కుమార్ చెప్పారని, దీంతో బీహార్ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారని, బీహార్ రాజకీయాల్లో స్థిరత్వం తిరిగి నెలకొంటుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉంటారన్న ఊహాగానాలను ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారు. ఆయనకు అలాంటి ఆశ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాల్లోనే కీలకంగా ఉంటారని అభిప్రాయపడ్డారు