Isudan Gadhvi: ఆప్ నుంచి గుజరాత్ సీఎం అభ్యర్థిగా జర్నలిస్ట్ ఇసుదన్‌ గాధ్వి, రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు తొలి విడత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడత‌లో 93 స్థానాల‌కు పోలింగ్

ఆప్‌ జాతీయ కార్యదర్శి ఇసుదన్‌ గాధ్విని గుజరాత్‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Gujarat AAP CM candidate Isudhan Gadhvi (Photo:Twitter/Isudan Gadhvi)

Gandhi Nagar, Nov 4: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీల‌ను ఈసీ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే.ఈ నేపథ్యంలో గుజరాత్లో త‌మ పార్టీ త‌ర‌పున‌ పోటీప‌డే సీఎం అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఆప్‌ జాతీయ కార్యదర్శి ఇసుదన్‌ గాధ్విని గుజరాత్‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వహించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నట్లు చీఫ్ ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడు‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడత‌లో 93 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్నట్లు ఆయ‌న వెల్లడించారు.

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం, అన్ని ప్రాథమిక తరగతులను మూసివేసిన ఢిల్లీ ప్రభుత్వం, 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా ఆదేశాలు

సీఎం అభ్యర్థి గాధ్వి.. జర్నలిస్టుగా పనిచేశారు. మొదట దూరదర్శన్‌లో పనిచేశారు. తర్వాత జర్నలిస్టుగా తన కెరీర్‌లో, గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో 150 కోట్ల అటవీ నిర్మూలన కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. కాగా, 2021లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి