IPL Auction 2025 Live

Jammu and Kashmir Elections: జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల రణక్షేత్రం, మోడీ వర్సెస్ రాహుల్..హోరెత్తనున్న ప్రచారం, అగ్రనేతల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు!

స్థానిక పరిస్థితుల దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి ఈ ఎన్నికలు కీలకం కాగా స్థానిక ప్రాంతీయ పార్టీల నుండి గట్టిపోటీ తప్పేలా కనిపించడం లేదు.

Jammu Kashmir elections, PM Modi - Rahul Gandhi tour updates

Hyd, Sep 4:  పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి ఈ ఎన్నికలు కీలకం కాగా స్థానిక ప్రాంతీయ పార్టీల నుండి గట్టిపోటీ తప్పేలా కనిపించడం లేదు.

ఇవాళ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనన్నారు. తొలి విడతలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనన్నారు రాహుల్‌. అలాగే ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొనననున్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుగా బరిలో దిగాయి. కాంగ్రెస్ 32 నియోజకవర్గాల్లో, ఎన్సీ 51 నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా సీపీఐ(ఎం), పాంథర్స్ పార్టీ అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు.

మరోవైపు జమ్మూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండగా సీఎం పిఠాన్ని కైవసం చేసుకునే విధంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు

వచ్చే వారం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం ఉండనుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా..సెప్టెంబర్ 6న ప్రచారంలో పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..జమ్మూ ఎన్నికల ఇంఛార్జీగా ఉన్నారు.

సెప్టెంబర్ 18న మొదటి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1వ తేదీన మూడో విడతలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.