Kamal Haasan Fire on PM Modi: కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? ముందు దేశ ప్రజల ఆకలి సంగతి చూడండి, ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడిన మక్కల్ నిధి మయమ్ అధినేత కమల్ హసన్

నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నిధి మయమ్ (Makkal Needhi Maiam) అధినేత, నటుడు కమల్ హసన్ ప్రధాని మోదీపై తీవ్రంగా (Kamal Haasan Fire on Modi) మండిపడ్డారు.

Kamal Haasan and PM Narendra Modi (Photo Credits: Twitter)

Chennai, Dec 13: నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నిధి మయమ్ (Makkal Needhi Maiam) అధినేత, నటుడు కమల్ హసన్ ప్రధాని మోదీపై తీవ్రంగా (Kamal Haasan Fire on Modi) మండిపడ్డారు.

దేశంలోని సగం జనాభా తిండీతిప్పలు (half of India is hungry) లేకుండా అల్లాడుతుంటే ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్‌ భవనం అవసరమా అని సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ప్రజలు అర్ధాకలితో ఉన్న సమయంలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని (new Parliament building) ఎందుకు కడుతున్నారని మండిపడ్డారు.

దేశం అర్ధాకలితో అలమటిస్తోంది. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అలాంటి సమయంలో 1,000 కోట్లతో పార్లమెంట్ భవన నిర్మాణం అవసరమా? చైనా గ్రేట్ వాల్ నిర్మాణం సమయంలో చాలా మంది మరణించారు. అయినా సరే... ప్రజలను కాపాడడానికే అని పాలకులు ప్రకటించారు. ఎవరిని కాపాడడానికి 1,000 కోట్లతో పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు? దయచేసి చెప్పండి ప్రధాని గారు ( Prime Minister Narendra Modi) అని కమల్ హసన్ ప్రశ్నించారు.కరోనా కాటుతో దేశ ఆర్థిక రంగం కుదేలైన వేళ ఇంతా భారీ వ్యయమెందుకని ఎద్దేవా చేశారు.

Here's MNM chief Kamal Haasan Tweets

వచ్చే ఏడు జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్న కమల్‌ ఈ మేరకు మోదీపై ట్విటర్‌ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. డిసెంబర్‌ 10న ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్‌ గెలుచుకుంది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు.