Bandi Sanjay Kumar: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను నియమించిన అధిష్ఠానం, ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని వెల్లడి
రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. అధ్యక్ష పదవి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేంధర్ తదితరులు పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎవరు కాదు, మళ్ళీ కే. లక్ష్మణ్ నే కొనసాగిస్తారని కూడా ప్రచారం జరిగింది.....
New Delhi, March 11: తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ బుధవారం కొత్త అధ్యక్షుడిని నియమించింది. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ స్థానంలో కరీంనగర్ లోకసభ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ను నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా, ఎంపీ బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (Telangana BJP President) గా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ నియామక పత్రాన్ని విడుదల చేశారు.
గతంలో ఆర్ఎస్ఎస్ మరియు ఎబివిపిల (RSS & ABVP) కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న బండి సంజయ్ ఉన్నారు 2005 మునిసిపల్ ఎన్నికల్లో కరీంనగర్ 48వ డివిజన్ నుంచి కార్పోరేటర్ గా గెలిచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ పై కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు.
Here's the update:
గత కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీలో మార్పులు జరుగుతాయని పార్టీలో ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. అధ్యక్ష పదవి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేంధర్ తదితరులు పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎవరు కాదు, మళ్ళీ కే. లక్ష్మణ్ నే కొనసాగిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఎట్టకేలకు కే. లక్షణ్ కు అధిష్టానం ఉద్వాసనం పలుకుతూ, ఆర్ఎస్ఎస్ మరియు ఎబివిపిలతో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బండి సంజయ్ ను అధ్యక్షుడిగా ఖరారు చేసినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం పట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.