Karnataka Election Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభంజనం, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడుకు తరలింపు, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు రూమ్స్‌ బుక్‌

గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం.

DK Shivakumar with former Karnataka CM Siddaramaiah (Photo-PTI)

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ECI ప్రకారం ప్రకటించిన మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 119 స్థానాల్లో, బీజేపీ 72 స్థానాల్లో, జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికార ఏర్పాటుకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. తాజా ECI డేటా ప్రకారం, కాంగ్రెస్‌కు 42.93% ఓట్లు, బీజేపీకి 36.17% ఓట్లు లభిస్తాయి, JDSకి 12.97% ఓట్లు వచ్చాయి.

ఈ ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం.శనివారం సాయంత్రం కల్లా ఎన్నికైన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అట్నించి నేరుగా తమిళనాడు తరిలించే విషయంలో అక్కడి తమ మిత్రపక్షమైన డీఎంకేతో సంప్రందిపులు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యత, 72 స్థానాల్లో బీజేపీ ముందంజ, 25 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యం

మెజారిటీ దాటినప్పటికీ తమ ఎమ్మెల్యేలకు రెండో అతిపెద్ద పార్టీ గాలం వేసే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర నేతల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన గోవా, తదితర రాష్ట్రాలలో పార్టీకి ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గెలిచిన ఎమ్మెల్యేలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెండు, మూడు ప్లాన్‌లు రెడీ చేసినట్టు తెలుస్తోంది.

ప్లాన్ 1,2 ప్రకారం ఎమ్మెల్యేలను తమిళనాడుకు, హైదరాబాద్‌కు సురక్షితంగా తరలించే అవకాశాలున్నాయని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో కాంగ్రెస్‌ నేతలు రూమ్స్‌ బుక్‌ చేసుకున్నారు. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20 రూములు, నోవేటల్ హోటల్‌లో 20 రూములను కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేతలు బుక్‌ చేసినట్టు సమాచారం. ఇవే కాకుండా మరికొన్ని హోటల్స్‌లో కూడా రూమ్స్‌ బుక్‌ చేసినట్టు సమాచారం.

కింగ్ మేకర్ కుమారస్వామికి షాకిస్తున్న ఫలితాలు, కాంగ్రెస్-బీజేపీ నుంచి గట్టి సవాల్, ఈ సారి గత సీట్ల మెజారీటీ కష్టమే

అయితే, కర్ణాటక, హైదరాబాద్‌కు సంబంధించిన వివిధ వ్యక్తుల పేర్లతో రూమ్స్‌ నిన్న బుక్ అయ్యాయి. కాగా, ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను ఈ హోటళ్లకు తీసుకొస్తారని సమాచారం. మరోవైపు.. ఏ పార్టీ నుంచి రూమ్స్‌ బుక్ చేశారో తమకు సమాచారం లేదని హోటల్ యజమాన్యాలు చెబుతున్నా​యి.